ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వైసీపీలో ఎమ్మెల్సీలు ఒకరి వెనుక మరొకరు నెమ్మదిగా జారుకుంటున్నారు. వీళ్లు ఎందుకీ విధంగా వెళ్లిపోతున్నారో అంతుచిక్కడం లేదు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందడం లేదు. ముందుగా వంశీ కృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య, జంగా కృష్ణమూర్తి, ఇక్బాల్ ఇప్పటికే రాజీనామా బాట పట్టారు. అలాగే వైసీపీ నుంచి బయటకు వెళ్తారని మరో ఎమ్మెల్సీ పేరు కూడా వినిపిస్తుంది.
బయటకు వెళ్లిన వారిలో ఒక్క వంశీకృష్ణ యాదవ్ మినహా మరెవ్వరికి టిక్కెట్లు కానీ .. పదవులు కానీ వేరే పార్టీల్లో దక్కలేదు. అస్సలు ఏ మాత్రం పార్టీ అధినాయకత్వంతో గొడవలు లేని ఎమ్మెల్సీలు.. అందునా.. నాన్ కాంట్రావర్సీ నేతలు.. ఇలా బయటకు వచ్చేయడమేంటోననిల వైసీపీలో గుసగుసలు వినిపిస్తుననాయి. పైగా వీరేమన్నా.. తమకిచ్చిన ఎమ్మెల్సీ పదవుల గడువు ముగిసే సమయంలో వైసీపీకి రాజీనామా చేశారా అంటే అదీ లేదు. 2024 ఎన్నికల తర్వాత కూడా రెండేళ్లు.. మూడేళ్లు వరకు చట్టసభల్లో ఉండే అవకాశం ఉన్నవారే వీళ్లంతా.
పదవి కాలం ఉన్నా బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చిన ఎమ్మెల్సీల్లో ఇద్దరు బీసీలు, ఓ బలిజ, ఓ మైనార్టీ ఉన్నారు. ప్రతి రోజూ మేమంతా సిద్దం సభల్లో సీఎం జగన్ నా నా నా అంటూ ఏ వర్గాల గురించి చెబుతారో.. ఆ వర్గాల వారే ఇలా బయటకు వచ్చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవి పోయాకో.. పదవుల కోసమో వెళ్లే రాజకీయ నేతలున్న ఈ రోజుల్లో పదవులను సైతం వదులుకుని వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారంటే.. అందరికీ తెలిసిందే.. వాళ్లకూ అర్థమైపోయి.. ముందు జాగ్రత్త పడుతున్నారని అనుకోవచ్చంటున్నారు.