https://www.youtube.com/watch?v=gFLVToNKBgY
చదువుతే వున్న మతి పోయిందని వెనకటికి మాంచి పాపులర్ సామెత. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఇది సరిగ్గా సరిపోతుంది. ట్రెండ్ సెట్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ గురించి ఇప్పుడు పరిచయ వాఖ్యలు అక్కర్లేదు. ప్రేక్షకులను తనకే సాధ్యమైన డైరెక్షన్ స్కిల్స్ తో మెస్మరైజ్ చేసి, కొత్త థియేటిరికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దర్శకుడు వర్మ. అయితే ఇదంతా వర్మ గత. ఇప్పుడు ఆయన నుండి మెరుపులు లేవు.
పైగా రివర్స్ గేర్ లో వెళుతున్నాడు వర్మ. షార్ట్ ఫిల్మ్ లతో కాలక్షేపం చేస్తున్నాడు. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసి దర్షకుడిగా మారుతాడు. కానీ వర్మ మాత్రం ట్రెండ్ సెట్ దర్శకుడిగా పేరు తెచ్చుకొని వరల్డ్ సినిమాని నమిలేసి ఇప్పుడు ‘చదివితే వున్న మతి పోయిందనే’ టైపులో షార్ట్ ఫిల్మ్ అంటు కాలం గడుపుతున్నాడు. ఎన్నో పైత్యపు వీడియోలు తీసిన వర్మ.. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా తీసేశాడు. అదే పోర్న్ సినిమా. పోర్న్ తార మియా మల్కొవాతో ఓ బ్లూ ఫిల్మ్ తీశాడు వర్మ. దీనికి శృంగార కళా ఖండం అని పేరు పెట్టాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ వీడియో ని రిలీజ్ చేస్తాడట. తాజాగా దీనిపై ఒక వీడియో ఓ టీజర్ లాంటింది వదిలారు.
ఈ టీజర్ లో షాకింగ్ ఎలిమెంట్ ఏమిటంటే .. ఈ సినిమాకి సంగీతం టైటిల్ లో ఎంఎం క్రీమ్ అని వేశారు. ఒక్కసారిగా షాక్ అయిపోవడం ఆ పేరు చదివిన వారి వంతైయింది. ఎంఎం క్రీమ్ ఎవరో చెప్పక్కర్లేదు. బాహుబలి ది గ్రేట్ కీరవాణి. ఆయన్ని బాలీవుడ్ లో ముద్దగా క్రీమ్ అని పిలిస్తారు. మరి వర్మ తీసిన ఈ కళా ఖండంలో ఏం నచ్చిందో కానీ.. శ్రీమాన్ ఎంఎం కిరావాణి ఓ బ్లూ ఫిల్మ్ కి కూడా సంగీతం చేశాననే ఖ్యాతిని నిలుపుకున్నట్లుయింది.