ఎం.ఎం.కీరవాణి…. తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మెలోడీల రారాజు. తెలుగుదనం నింపుకొన్న ఆ పాట.. ఇక మీదట మనకు వినిపించే అవకాశం లేదు. ఎందుంకంటే సినిమాలనుంచి కీరవాణి రిటైర్మెంట్ ప్రకటించేశారు. మరి కొద్ది సేపట్లో బాహుబలి 2 ఆడియో వేడుక సాక్షిగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈలోగా… ట్విట్టర్లో అందుకు సంకేతాలు పంపేశారు. తన విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ముఖ్యంగా తొలి అవకాశం ఇచ్చిర రామోజీ రావుకీ, తన ఉన్నతికి సోపానాలు వేసిన రాఘవేంద్రరావుకీ, రాజమౌళికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అయితే… కొన్ని సంచలన కామెంట్స్తోనూ షాక్ ఇచ్చారు.
బుర్రలేని చాలామంది దర్శకులతో తాను పనిచేయాల్సివచ్చిందని, చాలా ఫ్లాప్ సినిమాల్లో భాగం పంచుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కీరవాణి. వేటూరి మరణం, సిరివెన్నెల అనారోగ్యంతో తెలుగు సినిమా పాట మంచంపై పడుకోవాల్సివచ్చిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విలువైన సినిమాలకే పనిచేయమని రాంగోపాల్ వర్మ, రాఘవేంద్రరావులాంటి వాళ్లు సలహా ఇచ్చినా తాను పట్టించుకోలేదన్నారాయన. రాజమౌళి తనకు సంపూర్ఱ స్వేచ్ఛ ఇచ్చాడని, తన అభిప్రాయాలను గౌరవించాడని, అందుకే అతని సినిమాల్లో తన అత్యున్నత ప్రతిభ బయటపడిందని ట్వీట్టారు కీరవాణి. ఆయన ట్వీట్ల పరంపర ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సాయింత్రంలోగా తన రిటైర్మెంట్పై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తానన్నారాయన. చూద్దాం… కీరవాణి ఇంకెన్ని బాంబులు పేలుస్తారో?
I will let my fans know with my tweet by 5.30 pm today-
About my continuing/ discontinuing.— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017
https://twitter.com/mmkeeravaani/status/845920612849659909
https://twitter.com/mmkeeravaani/status/845920612849659909