వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా విజయం సాధించేశారు. తిరుపతి వెంకన్న దర్శనానికి వస్తున్నారట. ఓటింగుకు ముందు రోజు వెంకయ్య పుస్తకావిష్కరణ సభలో ఆయనను అభినందిస్తూనే ప్రధాని మోడీ ఒకింత చమత్కారంగా మాట్లాడారు. తరచూ పరిస్థితిని బట్టి పదవులు మారుతుంటాయి. వాటిని బట్టి మనం ప్రవర్తిస్తుంటాము. ఒకప్పుడు వెంకయ్య జాతీయ బిజెపి అద్యక్షుడుగా వుండగా నేను ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత ఆయన నేను ప్రధాన మంత్రిగా వుంటే ఆయన నా దగ్గర మంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి అవుతున్నారు. కాలం మనకు ఏవో పదవులు ఇస్తుంటుంది. వాటిని మనం నెరవేర్చాలి. వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించినప్పటినుంచి గమనిస్తున్నాను.కొంచెం పొడిగా, ఉదాసీనంగా వుంటున్నారు. మాకు తెలిసిన పాత వెంకయ్యలా లేరు. మరి అది రాజ్యాంగ పదవి కదా.. పార్టీలకు అతీతంగా వుండాలి. ఆయన ఈ పరిస్థితిని అధిగమిస్తారని, బాధ్యతలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను.. అని మోడీ వచ్చిన మార్పును వివరించారట. పైకి చాలా సాధాసీదా ముచ్చటగా కనిపించే ఈ మాటల వెనక బోలెడు అర్థాలు అంతరార్థాలు వున్నాయి. ఆలోచిస్తే!