వ్యాక్సిన్‌పై నమ్మకం లేకనే ముందుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు తీసుకోలేదని… రిస్క్‌లో పెట్టడానికే… ముందుగా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారనే విమర్శలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. రెండో విడతలో ప్రధాని మోడీ వ్యాక్సిన్ వేయించుకోవాలని నిర్ణయించారు. మోడీ పాటు ముఖ్యమంత్రులందరూ రెండో విడత వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉంది. అలాగే కేంద్రమంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధులకు కూడా.. వ్యాక్సిన్ వేస్తారు. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలలో పెరుగుతున్న సందేహాలను తగ్గిచేందుకు… అనుమానాలు నివృతి చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని ప్రధాని నిర్ణయించుకోవడంతో.. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా ప్రారంభమయింది. ప్రపంచంలోనే అతి భారీ వ్యాక్సినేషన్ అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రచారం చేసుకున్నా.. ప్రజల్లో దానిపై పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదు. చివరికి ఉచితంగా ఇస్తామన్నా… వైద్య సిబ్బంది కూడా ముందుకు రాని పరిస్థితి. దేశంలో పంపిణీ చేస్తున్న రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల విషయంలో సైడ్ ఎఫెక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా ముగ్గురు చనిపోయారు. తెలంగాణలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో చనిపోయారు. కొంత మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తగ్గిపోయాయి. అన్ని కేసుల్ని నిపుణులు వివరంగా పరిశీలిస్తున్నారు. అయితే దేనికీ… వ్యాక్సిన్ కారణం కాదని మాత్రం చెబుతున్నారు.
మొదటి విడత వ్యాక్సినేషన్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి.. రెండో విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి మూడో విడతలో 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులకు చోటు కల్పించలేదు. ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ముందుండే రాజకీయ నేతలు.. ఇప్పుడులేకపోవడంతో.. ఆ వ్యాక్సిన్‌పై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదన్న చర్చ జరిగింది. దీనికి పులిస్టాప్ పెట్టకపోతే… మొత్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఫెయిలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే కేంద్రం దీనికి చెక్ పెట్టేందుకు సిద్ధమయింది. రాజకీయ నేతలందరికీ వ్యాక్సిన్ వేయబోతున్నారు.