ఇటీవల రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ “స్వచ్చతా హీ సేవ” అనే కర్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గతవారం ప్రారంభమైన ఈ క్యాంపైన్ 2014 లో మోడీ ప్రారంభించిన స్వచ్చ భారత్ కి కొనసాగింపు. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి రానున్న సందర్భంగా ఈ పక్షం రోజులూ, ఈ క్యాంపైన్ ని ప్రజలకి చేరువ చెయ్యాల్సిందిగా అన్ని రంగాల లోని ప్రముఖులకి మోడీ వ్యక్తిగత లేఖలు వ్రాసారు.
ఈ లేఖలు అందుకున్నవారిలో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్, మోహన్ బాబులతో పాటు దర్శకుడు రాజమౌళి ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకి చెందిన వారిలో రజనీకాంత్, మోహన్ లాల్ లతో పాటు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉన్నారు. అయితే తెలుగు కి సంబంధించి పవన్ కళ్యాణ్ కి లేఖరాకపోవడం కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే మోడీక్, NDA అభ్యర్థులకి 2014 లో పవన్ నిస్వార్థంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం పవన్ ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారనున్నందుకే ఆయన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయలేదా లేక ప్రత్యేకహోదా మీద గళం విప్పి బిజెపి ని టార్గెట్ చేసినందుకు పవన్ ని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా అనేది ప్రస్తుతానికి సమధానం లేని ప్రశ్నే. ఏది ఏమైనా ” స్వచ్చతా హీ సేవ” అన్న ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.