హైదరాబాద్: రాజమండ్రి దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ఆయన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు మృతదేహాలను అప్పగించాలంటూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రివద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రివద్దకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌ను యాత్రికులు, ప్రతిపక్షాల నాయకులు ఘెరావ్ చేశారు. దీంతో ఆయన క్షతగాత్రులను పరామర్శించకుండానే వెనుదిరగాల్సివచ్చింది.