అవును మోడీ స్వరం మారింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనట్లుగా… మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకునే ముందు మోడీ స్వరం మారింది.
ఇంతకు ముందు బీజేపీ, బాజాపా అంటూ మోడీ స్పీచ్ సాగేది. కానీ, ఎన్నికల అనంతరం తొలిసారి జరిగిన ఎన్డీయే మీటింగ్ లో మోడీ స్పీచ్ మారిపోయింది. ఎన్డీయే, ఎన్డీయే అంటూ కూటమిని పొగుడుతూ… కూటమిలో ఉన్న నేతలను, రాష్ట్రాలను పొగుడుతూ సాగింది.
ముఖ్యంగా కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు, పవన్ తో పాటు.. ఏపీ ఎన్నికల్లో కూటమి విషయాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ ను తుఫాన్ తో పోల్చారు. మీటింగ్ జరుగుతున్నంత సేపు మోడీ-బాబు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం… కనిపించింది.
కేవలం బీజేపీయే నిర్ణయాలు తీసుకోకుండా… ఎన్డీయే మిత్రపక్షాల సూచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడటం చూస్తుంటే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనని, వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ జెట్ స్పీడ్ లో ముందుకు సాగే మంచి అవకాశం వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అమిత్ షా, నడ్డాలతో పాటు ఎన్డీయే మీటింగ్ లో ఉన్న నేతలంతా ఇప్పుడు చంద్రబాబుతో అన్యోన్యంగా ఉండటం… తెలుగు తమ్ముళ్ల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి.