ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…యోగా చేస్తున్న ప్రధానమంత్రి మోడీని చూపించి..” ఇతను ఎవరు” అని అడుగుతారు.
దానికి ట్రంప్ .. “ఆయన తెలియదా.. ప్రపంచ ప్రసిద్ధ ట్రావెలర్. అప్పుడప్పుడు ఇండియాలో ప్రధానిగా ఉంటారు.”. అంటాడు ట్రంప్. ఇలాంటి జోకులు… మోడీ విదేశీ పర్యటనలపై… ఇంటర్నెట్లో కోకొల్లలు. మోడీ సెల్ ఫోన్ ఎప్పుడూ ఏరోప్లేన్ మోడ్‌లో ఉంటుందని… పడే సెటైర్లకు లెక్కే లేదు. ఎందుకంటే.. నిజంగానే మోడీ.. అంతగా విదేశీ పర్యనటకు వెళ్లారు మరి.
నాలుగున్నరేళ్లలో ఆయన విదేశీ పర్యటనలను.. ఖర్చుగా చూస్తే.. రూ. 2013 కోట్లకుపైగానే తేలింది. దీనికి జీఎస్టీ అదనంగా కలుపుకోవాలేమో..?. దేశానికి ఓ విదేశాంగ మంత్రి ఉన్నారన్న సంగతిని కూడా ప్రజలు మర్చిపోయాలే మోడీ చేయగలిగారు. విదేశాలతో ఏ చిన్న పని ఉన్నా.. ముందుగా విమానం ఎక్కేది నరేంద్రమోడీనే. విదేశాంగమంత్రి అన్నా నరేంద్రమోడీనే ప్రధానమంత్రి అన్నా నరేంద్రమోడీనే. నాలుగున్నరేళ్లలో ఆయన ఆరు నెలలకుపైగా పాటు విదేశీ పర్యటనల్లోనే గడిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి 84 విదేశీ పర్యటనలు చేపట్టారు. వాటి ఖర్చు సరాసరి 280 మిలియన్డాలర్లు. అంటే రూ. 2వేల కోట్లకుపైమాటే.
ఎయిర్ ఇండియా నిర్వహణ ఖర్చు, సురక్షితమైన హాట్లైన్ఏర్పాటు కూడా విదేశీ పర్యటనల ఖర్చులో కలిపి ఉన్నాయి. మిగతా ఖర్చులు వేరే ఖాతాలో ఉంటాయన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా మోదీ.. అమెరికా అధ్యక్షుడు, జపాన్ ప్రధానిని అనేక మార్లు కలుసుకున్నారు. ఇందులో విషయం ఏమిటంటే… చైనాకు ఓ అనధికారిక పర్యటన కూడా జరిపారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌కు వెల్లడించారు. అలాగే పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన వెంటనే ఆయన జపాన్పర్యటనకు వెళ్లారు. ప్రజలు బ్యాంకుల వద్ద నిలబడి ఇబ్బందులు పడుతుంటే మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు.
ఈ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ఏమైనా ఒరిగిందా అంటే… అదీ లేదునే విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటాయి. నరేంద్రమోడీ ప్రపంచాన్ని చుట్టేశారు కానీ.. భారతదేశం సుదీర్ఘ కాల డిమాండ్ అయిన… ఐక్యారాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వన్ని సంపాదించడానికి అవసరమైన మద్దతును కూడగట్టలేకపోయారు. పోనీ.. మిత్రదేశాల సంఖ్య పెరిగిందా అంటే.. అదీ లేదు. అమెరికాతో అతిగా అంటకాగడం వల్ల విబేధించేవాళ్లు పెరిగిపోయారనేది.. విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్పే మాట. మొత్తానికి మోదీ .. విదేశీ పర్యటనల్లో మాత్రం.. కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించారన్నది మాత్రం నిజం. ఒకప్పుడు.. గోధ్రా మచ్చ వల్ల.. మోడీకి వీసా ఇవ్వడానికి ప్రపంచ దేశాలు నిరాకరించాయి. ఇప్పుడు ప్రధాని హోదా ఆయా దేశాలన్నింటిలో అడుగు పెట్టేశారు.