మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను ప్రధాని. రాజ్యాంగపరమన బాధ్యతల ప్రకారం .. ఏపీకి సహకరించడం వరకే. అంతే తప్ప జగన్ రెడ్డిని మోడీ ఎప్పుడూ మిత్రుడిగా చూడలేదు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మోదీ ఈ విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా తేల్చి చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి తన పార్టీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయనే తాము ప్రతిపాదించిన బిల్లులకు మద్దతిచ్చారని మోదీ భావన. అయితే జగన్ రెడ్డి బీజేపీకి ఐదేళ్ల పాటు సహకరించడానికి కారణం మాత్రం ఆయనకు తెలుసు.. ప్రజలకు తెలుసు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటికీ బీజేపీని కానీ మోదీని కానీ పల్లెత్తు మాట అనే ధైర్యం చేయలేకపోయారు. అది ఆయన పరిస్థితి.
ఏపీలో పరిస్థితి ఘోరంగా ఉందని.. జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచే అవకాశం లేదని మోదీ భావన. మళ్లీ గెలవడం అంటే.. ఇప్పుడే కాదు.. ఇంకెప్పుడూ సాధ్యం కాదని ఆయన అనుకుంటున్నారు. బీజేపీ.. టీడీపీ కూటమితో చేరడానికి ఇదే నమ్మకం కావొచ్చు. టీడీపీతో కలవకుండా జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఆపడానికి చేయని ప్రయత్నాలే లేవు. చివరికి తాము ఎన్డీఏలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ చేర్చుకోలేదని అంటున్నారు. జగన్ పై మోదీ అభిప్రాయం తెలిసిన తర్వాత అందులో ఆశ్చర్యం ఏమీ లేదని రాజకీయవర్గాలు కూడా అనుకుంటున్నాయి.