తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎవరి కోసం పెడుతున్నారు..? బీజేపీ కోసం..! మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి విపక్షాలన్నీ కలసి వచ్చినా… కేసీఆర్ మాత్రం ఎవరి కోసం ఆందోళన చేశారు..? బీజేపీ కోసం..! . కోర్టు విచారణలో ఉన్న ఓటుకు నోటు కేసులో.. ఇప్పుడు మళ్లీ ఎందుకు హడావుడి చేస్తున్నారు..? ఇదీ కూడా బీజేపీ కోసమే..!. బీజేపీ కోసం కేసీఆర్ ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు..?. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందా.. ? అలా చేస్తే… వన్ ప్లస్ వన్ జీరో అవుతుంది. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. మరి బీజేపీ కోసం ఎందుకు కేసీఆర్…రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారా..? అన్నీ తన సొంత ఆలోచనలా ..? లేక ఏం చేయాలో కూడా.. బీజేపీ చెబుతోందా..?
గుర్తుందా.. కేసీఆర్ కొన్నాళ్ల క్రితం పన్ను పీకించుకుంటానని ఢిల్లీ వెళ్లారు. ఏం చేశారో తెలియదు. పన్ను పీకించుకోవడానికి వారం రోజులు రహస్యంగా గడిపారు. ఒకరిద్దర్ని కేంద్రమంత్రుల్ని కలిసినట్లు ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ తరహా కంటి ఆపరేషన్ ఎపిసోడ్ ఢిల్లీలో రెండు సార్లు నడిచింది. ఓ సారి ఇంజక్షన్ అంటే భయం కారణంగా.. కేసీఆర్ ఆపరేషన్ చేయించుకోకుండా వచ్చేశారని ప్రచారం చేశారు. మరోసారి ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం అంత పెద్ద పన్ను పీకే.. కన్ను ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్ హైదరాబాద్‌లో లేకనా…? అన్న విమర్శలు అప్పట్లోనే చాలా ఎక్కువగా వినిపించాయి. ప్రియాంకాగాంధీ కుమారుడి కంటికి క్రికెట్ దెబ్బ తగిలితే.. ఢిల్లీ నుంచి వచ్చి ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
మరి హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? నోట్ల రద్దును మొదట తుగ్లక్ నిర్ణయమన్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే మాట మార్చారు. అద్భుతమని పొగిడారు. ఢిల్లీలో ఏం జరిగింది..? ణలా చెప్పుకుంటూ ఉంటే.. కేసీఆర్ విషయంలో చాలా చాలా అనుమానాలొస్తాయి. మధుయాష్కీ లాంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే… కేసీఆర్ అక్రమంగా విదేశాలకు నిధులు తరలించిన వ్యవహారాలు కేంద్రం దగ్గరున్నాయని.. ఈడీ నోటీసులొచ్చినప్పుడల్లా వెళ్లి డీల్ సెట్ చేసుకుని వస్తున్నారని నేరుగానే చెబుతున్నారు. అంతే కాదు.. ఆ మధ్య సీబీఐ అధికారులు… స్వయంగా కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కు వచ్చి మరీ… కేసీఆర్‌ను ప్రశ్నించారు. తాను కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు.. కొన్ని అవతకవకలకు పాల్పడ్డారని.. ఆ కేసులో ఇప్పుడు ఆయనను ఇరికించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ కారణాలతో కేసీఆర్ పూర్తిగా … కేంద్రం.. ముఖ్యంగా.. అమిత్ షా..మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిటనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి జగన్ ను నేరుగా కేసుల బూచి చూపి.. జుట్టును పట్టేసుకుంది బీజేపీ. పవన్ కల్యాణ్‌ను పెన్ డ్రైవ్‌ల పేరుతో…ఆట ఆడిస్తోందని రూమర్స్ వస్తున్నాయి. కేసీఆర్ కూడా ఎప్పుడో ఇరుక్కుపోయినట్లు ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఆయన రాజకీయ చాణక్యంతో ఇప్పటి వరకూ నెట్టుకురాగలిగారు. కానీ ఇప్పుడు.. అంతా బయటపడుతోంది.