చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ కోరుకున్న డోస్ ఇచ్చేశారు. రాజమండ్రి వేమగిరిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ.. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్ తో పెరిగిందన్నారు.
వైసీపీకి 5 సంవత్సరాలు పాలించే అవకాశం వచ్చినా.. వారు ఉపయోగించుకోలేకపోయారని తెచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిందని .. అందుకే వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని ప్రకటించారు. అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదని ప్రకటించారు. మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేశారని.. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్ స్పీడ్తో పరిగెత్తిందన్నారు. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని… అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్గా తయారై దోపిడీకి పాల్పడ్డారన్నారు.
కేంద్ర నిధులను ఎన్నో విధాలుగా ఇస్తున్నా అందుకోలేకపోయిదని మోదీ విమర్శించారు. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలనుకున్నాం కానీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు అన్నదన్నారు. చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా దోపిడీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుందని ..పీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ అన్నారు.
అమిత్ షా , ప్రధాని మోదీ ఒక్క రోజు వ్యవధిలోనే జగన్ రెడ్డి సర్కార్ పై ఈ స్థాయిలో విరుచుకుపడంట వైసీపీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ మీడియా ఇంటర్యూల్లో కంగ్రెస్ ను విమర్శించి.. తాము బీజేపీ వైపే ఉంటామన్న సంకేతాలను జగన్ ఇచ్చినా బీజేపీ అగ్రనేతలు కనీసం పట్టించుకోవడం లేదు.