ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన మారధాన్ రోడ్ షో చర్చనీయాంశమయింది. అయితే అది పాజిటివ్ గా కాదు నెగెటివ్ వేలో. మోదీ రోడ్ షో కోసం ఎంత ఖర్చు చేశారో ఊహించనంత భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదు. అసలే అంతంతమాత్రంగా ఉండే బెంగళూరు మోదీ రోడ్ షో కారణంగా జామ్ అయిపోయాయి. దీనిపై ప్రజలు మీడియా ముఖంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కర్ణాటకలో బీజేపీ ఎదురీదుతోంది. అందులో సందేహం లేదు. అన్ని సర్వేలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. చివరికి ఏం చేశామో చెప్పుకోలేక హనుమాన్ చాలీసా, కేరళ స్టోరీ అంటూ కథలు కూడా చెప్పారు. బెంగళూరు నగరంలో అత్యధిక సీట్లు సాధిస్తే. .. కనీసం జేడీఎస్ తో కలిసి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఉద్దేశంతో మోదీ రెండు రోజుల పాటు బెంగళూరుకు కేటాయించారు. రోడ్ షోతో హోరెత్తించారు. ఇది ప్లస్ గా మారాల్సింది పోయి.. మైనస్‌గా మారుతోంది. ఆయనపై నెగెటివ్ ప్రచారం జోరుగా సాగడానికి కారణం అవుతోంది.
దక్షిణాదిలో మోదీకి క్రేజ్ లేదు. కర్ణాటకలోనూ లేదు. మోదీ లేనప్పుడు కూడా అక్కడ బీజేపీ బలంగానే ఉంది. దానికి వేరే కారణాలు ఉన్నాయి. అయితే మోదీ మాత్రం తాను గెలిపిస్తానన్నట్లుగా.. తనకు గుజరాత్ లో ఉన్నంత క్రేజ్ ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దానికి భారీ ఆడంబర ఏర్పాట్లు చేయడం చివరికి మైనస్ అవుతోంది. బెంగళూరులో వస్తాయనుకున్న సీట్లు కూడా.. మోదీ టూర్ తర్వాత పోతాయన్న సెటైర్లు పడుతున్నాయి.