ప్రపంచ టెక్నాలజీ ప్రధాన కేంద్రంగా పేరు పొందిన సిలికాన్ వ్యాలీల్ భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆ తర్వాత ఫేస్ బుక్ సి ఇ ఒ లతో మోడీ భేటీ అయ్యారు. టెక్నాలజీ సి ఇ ఒ లతో డిన్నర్ లో మోడీ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఆయన దార్శనికతను సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తదితరులు ప్రశంసించారు.
మోడీ ప్రయత్నాలకు ఈ సందర్భంగా సానుకూల ఫలితాలు వచ్చాయి. మన దేశంలోని 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందించడానికి గూగుల్ సహాయం చేస్తుంది. ఇందుకు గూగుల్ అంగీకరించిందని మోడీ ప్రకటించారు. భారత దేశంలోని 5 లక్షల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో (లోకాస్ట్) బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే కేంద్ర ప్రభుత్వ బృహత్తర పథకంలో తాము భాగస్వాములం అవుతామని మైక్రోసాఫ్ట్ సి ఇ ఒ సత్య నాదెళ్ల ప్రకటించారు. 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మొబైల్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ (ఐ ఒ ఐ) స్టార్టప్ కోసం ఫండ్ ఏర్పాటు చేయడానికి చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ అంగీకరించింది.
డిజైన్ ఇన్ ఇండియాకు సహాయం చేయడానికి కూడా క్వాల్ కామ్ ఒప్పుకొంది. భారత్ ను డిజిటల్ సాధికారిక, నాలెడ్జి ఎకానమీగా తీర్చిదిద్దాలనే మోడీ ఆలోచనను తాము సమర్థిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రకటించారు. భారత్ లోని క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టం డేటాను మైక్రోసాఫ్ట్ వచ్చే వారం ప్రకటిస్తుంది. ఫేస్ బుక్ సి ఇ ఒ మార్క్ జుకర్ బర్గ్ తో మోడీ భేటీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. డిజిటల్ ఇండియా ఆలోచనకు మద్దతుగా తన ఫేస్ బుక్ పేజీ ప్రొఫైల్ ఇమేజిని కూడా మార్చారు. మొత్తానికి అమెరికా సిలికాన్ వ్యాలీలో మోడీ ఒక రాక్ స్టార్ లా స్వాగతం పొందారు. బడా కంపెనీల అధినేతలు మోడీతో భేటీకి చాలా ఉత్సాహం చూపారు. ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఫొటోలు దిగడానికి కూడా ఆసక్తి చూపడం విశేషం.