ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విరుచుకుపిన తితలి తుపాన్ ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రధానికి అనని వివరాలు అందించారు. నష్టం అంచనాలనూ వివరించారు. ఈ తుపాను ప్రభావం ఒడిషాపై ఎక్కువగా పడింది. ఒడిషా సీఎంకు కూడా..మోడీ ఫోన్ చేశారు. వివరాలు కనుక్కున్నారు. కానీ ఎలాంటి ఆర్థిక సాయం ఆఫర్ చేయలేదు. విశాఖపై విరుచుకుపడిన హుదూద్ కన్నా భయంకరంగా.. శ్రీకాకుళం జిల్లాపై… తితలి తుపాను విరుచుకుపడింది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంగా వీచిన గాలులు.. ఆరు మండలాలను.. దాదాపుగా తుడిచి పెట్టేశాయ. కరెంట్ స్తంభాలు మాత్రమే కాదు.. చెట్లు పుట్టలన్నీ నేల మట్టమయ్యాయి.
కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉద్ధానం ప్రాంతంపై ప్రధానంగా తితలి తుపాన్ ప్రభావం పడింది. అక్కడ భారీగా ఆస్తి నష్టం సంభవించంది. గాలులు ఎంత తీవ్రంగా వీచాయంటే.. జాతీయ రహదారిపై… కంటెయినర్ లారీలు కూడా… పల్టీలు కొట్టుకుంటూ.. రోడ్డుకు అవతల పడిపోయాయి. నష్టం అంచనా వేయలేని పరిస్థితి అక్కడ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం శ్రీకాకులం వెళ్లి అక్కడే మకాం వేశారు. ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించనున్నారు. పలువురు మంత్రులు కూడా.. సీఎం వెంట ఉన్నారు. తుపాను ధాటికి 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతి చెందారు.
ఆరు మండలాలల్లో.. సామాన్యుల ఆస్తులకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు ఎక్కడా మిగల్లేదు. వీరందరికీ సాంత్వన కలిగించడం… ప్రస్తుతం ప్రభుత్వానికి ముఖ్యమైన పని. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముఖ్యమంత్రికి ఫోన్ చేసి.. వివరాలు అడిగారు తప్ప.. ఫలానా సాయం చేస్తానని మాత్రం చెప్పలేదు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. తాను పట్టించుకోకుండా.. ఏమీ లేనని.. చెప్పుకోవడానికి కాల్ చేశారని.. అంతకు మించి సాయం చేసే ఉద్దేశం లేదని సీఎంవో వర్గాలు నిట్టూరుస్తున్నాయి.