ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…యోగా చేస్తున్న ప్రధానమంత్రి మోడీని చూపించి..” ఇతను ఎవరు” అని అడుగుతారు. ఆయన తెలియదా..” ప్రపంచ ప్రసిద్ధ ట్రావెలర్. అప్పుడప్పుడు ఇండియాలో ప్రధానిగా ఉంటారు.”. అంటాడు ట్రంప్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న జోక్ ఇది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనల గురించి… నెటిజన్లు ఇలాంటి సెటైర్లు చేలా వేస్తారు. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు చేసే విమర్శలకు కొదువ ఉండదు. దేశానికి ఓ విదేశాంగ మంత్రి ఉన్నారన్న సంగతిని కూడా ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. విదేశాలతో ఏ చిన్న పని ఉన్నా.. ముందుగా విమానం ఎక్కేది నరేంద్రమోడీనే.
అసలు నరేంద్రమోడీ నాలుగేళ్లలో ఎన్ని విదేశీ పర్యటనలకు వెళ్లారు… ఆ పర్యటనలకు ఎంత ఖర్చయిందనే విషయం చాలా మందికి ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితం..మోదీ ఇమేజ్ మేకోవర్ కోసం.. ప్రచారానికి రూ. 4వేల కోట్లకుపైగా.. ఖర్చు చేశారని.. సమాచారహక్కు చట్టం ద్వారా బయటకు తెలిసేసరికి చాల మంది నోరెళ్లబెట్టాల్సి వచ్చిది. ఇప్పుడు మోడీ విదేశీ పర్యటనల ఖర్చు కూడా… సమాచార హక్కు చట్టం ద్వారానే బయటకు వచ్చింది. 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో ప్రధాని 41 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఒక సారి ఒకే దేశాన్ని కాక.. మూడు నాలుగు దేశాల్ని కవర్ చేశారు. 52 దేశాలను ఆయన చుట్టి వచ్చారు. పర్యటనలకు రూ 355 కోట్లకు పైగా ఖర్చయ్యాయి.
ప్రధాని మోడీ 48 నెలల పదవీకాలంలో165 రోజుల పాటు విదేశీ పర్యటనల్లో గడిపారు. ఈ పర్యటనల్లో 30 సార్లు ప్రధాని ఉపయోగించిన చార్టర్డ్విమానాల బిల్లులను బయటపెట్టారు. మరో 12 పర్యటనల ఖర్చులను మాత్రం బయటపెట్టలేదు. సగటున మోడీ .. పదకొండు విదేశీ పర్యటనలకు వెళ్లారు.. అంటే… నెలకు ఒకటి చొప్పున అనుకోవచ్చు. ఇంత తరచూగా.. మరో భారత ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చేయలేదు.
ఈ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ఏమైనా ఒరిగిందా అంటే… అదీ లేదునే విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటాయి. నరేంద్రమోడీ ప్రపంచాన్ని చుట్టేశారు కానీ.. భారతదేశం సుదీర్ఘ కాల డిమాండ్ అయిన… ఐక్యారాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వన్ని సంపాదించడానికి అవసరమైన మద్దతును కూడగట్టలేకపోయారు. పోనీ.. మిత్రదేశాల సంఖ్య పెరిగిందా అంటే.. అదీ లేదు. అమెరికాతో అతిగా అంటకాగడం వల్ల విబేధించేవాళ్లు పెరిగిపోయారనేది.. విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్పే మాట. మొత్తానికి మోదీ .. విదేశీ పర్యటనల్లో మాత్రం.. కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించారన్నది మాత్రం నిజం. మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఈ లోపు మరెన్ని పర్యటనలు చేస్తారో చూడాలి..!