ఆఫ్ఘనిస్తాన్ కోసం భారత్ ఆ దేశ రాజధాని కాబూల్ లో రూ.710 కోట్ల వ్యయంతో 86 ఎకరాలలో మొగల్ సంప్రదాయానికి అనుగుణంగా అత్యాదునిక వసతులతో పార్లమెంటు భవనాన్ని నిర్మించి ఇచ్చింది. దానిని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకొన్న ప్రధాని మోడీ అక్కడి నుండి నేరుగా కాబూల్ చేరుకొంటారు. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన తరువాత ఆఫ్ఘన్ పార్లమెంటు సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
ఆ తరువాత కాబూల్ నుంచి నేరుగా డిల్లీ చేరుకొంటారు. నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మ దినోత్సవం. కనుక డిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా వాజ్ పేయినివాసానికి వెళ్లి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే వాజ్ పేయి చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఇదివరకు ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించినపుడు కూడా ఆ అవార్డును ఆయన ఇంటికే తీసుకువెళ్ళి ఆయనకు అందజేశారు. అప్పటికే ఆయన ఆరోగ్యస్థితి బాగోలేదు. వృదాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు సమాచారం.