బీజేపీ అధ్యక్షుల్ని మార్చేసి కొత్త వారిని నియమించినంత వేగంగా… కేంద్ర కేబినెట్లో మోదీ మార్పు చేర్పుుల చేయలేకపోతున్నారు. ఇదిగో అదిగో అన్నారు కానీ.. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఎప్పుడు జరుగుతుదో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులకు .. రాష్ట్ర బీజేపీ బాధ్యతలు ఇచ్చారు. వారు అటు కేంద్ర మంత్రి పదవిలో.. ఇటు .. బీజేపీ అధ్యక్షులుగా పని చేసుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే… ఆ రెండు రాష్ట్రాలు.. రాజస్థాన్, తెలంగాణల్లో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ సమావేశాలకు ముందే ఉంటుందని అనుకున్నారు. కానీ సమీకరణాలు కుదరలేదు.. బీఎల్ సంతోష్, అమిత షాల కసరత్తు మోదీకి నచ్చలేదని చెబుతున్నారు. అందుకే పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. ఇలా మోదీ… తన టీమ్ పై పెద్దగా నమ్మకం పెట్టుకోలేకపోతూండటంతో పాటు…. ఇతర కారణాల వల్ల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఆలస్యం అవుతోంది. పార్టీపై మోదీ పట్టు తప్పిపోతోందని అనడానికి ఇదే నిదర్శమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెద్దగా కష్టపడకుండా… మంత్రివర్గాన్ని మార్చేయడం గత ఎనిమిదేళ్లుగా జరుగుతూనే ఉంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన వారిని ఎక్కువగా మంత్రులు గా చేసే వారు. చాలాసార్లు ఈ ప్రయోగం సక్సెస్ అయింది. మరి ఈ సారి ఎందుకే మోదీ కూడా సంకోచించాల్సి వస్తోంది.