దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి రానున్నారు. పాలసముద్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరక్ట్ టాక్సెస్, అండ్ నార్కోటిక్స్ ను మోదీ ప్రారంభిస్తారు. విభజన చట్టంలో భాగంగా చంద్రబాబు హయాంలో దీన్ని కేటాయించారు. ఇప్పటికి ప్రారంభిస్తారు. ఇందులో ఐఆర్ఎస్ అధికారులుక ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సెంటర్ ను మోడీ ప్రారంభిస్తారు. ఇది అధికారిక కార్యక్రమం.
సాధారణంగా మోదీ ఏ రాష్ట్రంలో అధికారిక పర్యటనకు వెళ్లినా ఓ బ హిరంగసభ ఉంటుంది. ఎన్నికల సమయంలో కాబట్టి పార్టీ పరంగా ఏర్పాటు చేస్తూంటారు. ఇటీవల తమిళనాడులో ఇలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించి సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏపీకి వస్తున్నారు. అయితే బహిరంగసభ అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో రాజకీయాలు బీజేపీ విషయంలో అనిశ్చితంగా ఉన్నాయి. పొత్తులు పెట్టుకోవాలని టీడీపీ తమను అడగాలని బీజేపీ కోరుకుంటోంది. కానీ టీడీపీ మాత్రం అడగడం లేదు. పొత్తులు వద్దు ుకానీ మీతోనే ఉంటామని సంకేతాలు పంపుతున్నారు.
బీజేపీ పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా టీడీపీ పెట్టుకుంటుంది. కానీ అది రెండు పార్టీలకు నష్టదాయకమని వివరించే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ బీజేపీ వింటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పదహారో తేదీన మోదీ పర్యటనలో చోటు చేసుకోబోయే రాజకీయాలే… ఏపీ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశం ఉంది. మోదీ జగన్ రెడ్డి సర్కార్ పై ప్రశంసలు చేసినా… సైలెంట్ గా ఉన్నా… బీజేపీ ఒంటరి పోరాటానికే మొగ్గు చూపుతున్నట్లుగా అనుకోవచ్చు.