ప్రధాని మోదీ ఏపీలో రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ కార్యక్రమం ఎట్టకేలకు జరిగింది. ఈ పర్యటన పూర్తిగా మోదీని సంతోషపెట్టడానికే సాగింది. ఆయన కోసం పక్కా ఏర్పాట్లతో రోడ్ షో నిర్వహించారు. తర్వాత బహిరంగసభలో లోకేష్, పవన్, చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు పొగడ్తలు అయితే ఢిల్లీ ఎన్నికల వరకూ వెళ్తాయి. అక్కడ ఎన్డీఏ గెలిచి తీరుతుందని అన్నారు. అక్కడ ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రమే పోటీ చేస్తోంది. అదే సమయంలో మోదీని ప్రపంచ లీడర్ గా అభివర్ణించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు ప్రదాని మోదీని.. ఇటు సీఎం చంద్రబాబును కూడా పొగిడారు. మోదీ దేశాన్ని.. చంద్రబాబు రాష్ట్రాన్ని దార్శనికుల్లా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. నారా లోకేష కూడా తన స్పీచ్‌లో మోదీని పొగిడేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఎన్నికల సభ కాదు. అయినా ఢిల్లీ ఎన్నికల కోసం అన్నట్లుగా రోడ్ షో, సభలు నిర్వహించారు. వేదికపై నుంచి ప్రధాని మోదీ శంకుస్థాపనులు, ప్రారంభోత్సవాలు పూర్తి చేసిన తర్వాత .. ఎప్పట్లాగే .. రాష్ట్రంపై ఎనలేని ప్రేమ చూపిస్తూ మోదీ ప్రసంగించారు.
చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్ర..ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని జోస్యం చెప్పారు.