బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పని చేసి..చాలెంజ్ చేసి మరీ సక్సెస్ కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత తాను వ్యూహకర్త పనులు మానేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ బయటకు అలా చెప్పినప్పటికీ.. ఆయన అసలు మిషన్ అంతర్గతంగా ప్రారంభించినట్లుగా చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక కూటమికి ఆయన సేవలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన జాతీయ నేత శరద్ పవార్‌తో పీకే భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలందర్నీ ప్రశాంత్ కిషోర్ కలుస్తారని.. ఆయన టీం చెప్పుకొచ్చింది.
కృతజ్ఞతల కోసమేనని చెబుతున్నారు కానీ.. ఈ పాండమిక్ సమయంలో.. ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడానికే ఆయన కలవడం నమ్మశక్యంగా లేదని అంటున్నారు. మమతా బెనర్జీకి మద్దుత తెలిపిన వారంతా.. కాంగ్రెస్ కూటమిలోని పార్టీలే. అంటే.. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండే అవకాశం ఉన్న వారు. బహిరంగంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వారే. దీంతో.. అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని 2024కి కలసికట్టుగా బీజేపీని ఎదుర్కొనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోతోందని.. కరోనా కట్టడి దగ్గర్నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకూ.. వేటినీ కంట్రోల్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయంతో ఉన్న రాజకీయ విశ్లేషకులు.. ప్రశాంత్ కిషోర్.. రంగంలోకి దిగినట్లుగానే భావిస్తున్నారు.
మోడీకి పోటీగా ఓ ప్రధాని అభ్యర్థిని గట్టిగా ప్రొజెక్ట్ చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని. అది రాహుల్ గాంధీ అయితేనే ప్రభావం ఉంటుందని.. అలాంటి సందర్భంలో తాను వ్యూహకర్తగా పని చేయాడనికి సిద్ధమని అన్నట్లుగా జాతీయ మీడియాలో కొంత కాలం ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. వ్యూహకర్తగా పీకే… బీజేపీ వ్యతిరేక కూటమి కోసం.. అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నారని అనుకోవచ్చు.