తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయనకు ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు… ఉండవల్లిలోని సీఎం ఇంటికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఈ రోజు కూడా.. అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు. హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరై.. అక్కడ్నుంచి తిరుపతికి వెళ్తారు. అక్కడ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభిస్తారు. చంద్రబాబు తన 69 ఏళ్ల జీవితం పూర్తిగా రాజకీయంతోనే ముడిపడి ఉంది. విద్యార్థి నేతగా.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి, పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పని చేశారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా… సెంటర్ పాయింట్‌గా ఉంటూనే వస్తున్నారు.
గత ఏడాది పుట్టిన రోజున ఆయన… ధర్మపోరాట దీక్షలు ప్రారంభించారు. విజయవాడలో రోజంతా దీక్ష చేశారు. ఆ తర్వాత రాజకీయ పోరాటం ప్రారంభించారు. ఏడాది పాటు అలుపెరగకుండా… కేంద్రంపై పోరాటం చేశారు. మళ్లీ పుట్టిన రోజు వచ్చే సరికి.. ఆయన ఎన్నికల సమరం ముగించారు. ఫలితం… ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిస్తే.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అదో చరిత్ర అవుతుంది. కేంద్రంలో.. చక్రం తిప్పే అవకాశాలు ఈ ఏడాది మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఇరవై స్థానాల వరకూ గెలుచుకుంటే… కచ్చితంగా.. ఢిల్లీలో చంద్రబాబుది కీలక పాత్ర అవుతుంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. ఇప్పటికే…క్లారిటీ వచ్చేయడం.. గతంలో.. చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్ర ఇప్పటికీ.. తెర ముందే ఉండటంతో.. ఆయనకు కలసి రానుంది.
జాతీయ నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో… ఆ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు 69వ వసంతంలో.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగేలా… సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఆయన నిరంతర శ్రమ, పట్టుదలే కారణం. .. హ్యాపీ బర్త్ డే .. చంద్రబాబు..!