తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’. ఈ సినిమాని వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడంటే ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే వెంకీ అంటేనే రీమేక్ స్టార్. ధనుష్ పాత్రకు ఎంత వరకూ సరిపోతాడు? అనే ప్రశ్న ఒక్కటే రేగింది. అయితే ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల చేతికి ఇచ్చినప్పుడు మాత్రం అందరూ షాక్ తిన్నారు. శ్రీకాంత్ అడ్డాల శైలికీ ఈ కథకూ ఏమైనా పోలిక ఉందా? అంటూ ముక్కుమీద వేలేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ కాంబినేన్పై జోకులు కూడా మొదలైపోయాయి.
ఇప్పుడు ‘అసురన్’ కథనీ కెలకడం మొదలెట్టారు. ‘అసురన్’ సీరియస్గా సాగే డ్రామా. కథలోని ఎమోషన్స్, ఆ సీరియస్నెస్ ఈ సినిమాకి బలం. అయితే.. ఇప్పుడు ఆ సీరియస్నెస్ డోసు కొంచెం తగ్గించాలని చూస్తున్నారు. ఆ ప్లేసులో కామెడీ జోడించాలన్నది చిత్రబృందం తాపత్రయం. ఆకుల శివ అనే రచయితను తీసుకొచ్చి – `ఫన్` సీన్లు రాయించాలని చూస్తున్నారు. ఆకుల శివ కూడా రంగంలోకి దిగిపోయి… ఈ కథని అటూ ఇటూ కదల్చడం మొదలెట్టారని టాక్. ధనుష్ క్యారెక్టర్ని సైతం టోన్ డౌన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు నేటివిటీకి తగిన మార్పులు ఎప్పుడూ అవసరమే. కానీ పాత్ర ఔచిత్యాన్ని, కథలో గాఢతనీ దెబ్బతీసేలా మార్పులు ఉండకూడదు. అయినా… కథ సీరియస్ గా సాగితే తెలుగు ప్రేక్షకులు చూడరని ఎందుకు అనుకోవాలి? మొన్నటి ‘ఖైదీ’ చూడలేదా? ఇన్ని రీమేక్ లు చేసిన వెంకీకి ఈ విషయం ఎందుకు అర్థం అవ్వడం లేదో..?