ఇన్‌కంట్యాక్స్ : శ్లాబులు పెరిగాయి సరే.. మరి పన్ను తగ్గిందా..?

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు నిర్మలమ్మ తనదైన శైలిలో ఆనందం కలిగించారు. ఎంతో పెద్ద ఊరట కల్పిస్తున్నట్లుగా ఘనంగా చెప్పారు. సొంత పార్టీ సభ్యులు … బల్లలు చరుస్తూండగా మినహాయింపులు ప్రకటించారు. అహో.. ఓహో అనుకుని.. లెక్కలు వేసుకున్న వేతన జీవులు… ఊసూరుమనక తప్పలేదు. ఎందుకంటే.. అధిక వేతనం అందే వారికి మాత్రమే కాస్త ఊరట లభించింది. ఓ మాదిరి వేతనం ఉన్న వారికి.. ఎలాంటి మినహాయింపులు లభించలేదు. గతంలో మాదిరిగా రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే.. ఇక్కడా ట్విస్ట్ పెట్టారు. రెండు రకాల ఆప్షన్లు ఇచ్చారు. పాత విధానం కింద.. రెండున్నర లక్షల వరకూ మినహాయింపు.. ఐదు లక్షల వరకూ స్టాండర్డ్ డిడక్షన్… ఉంటుంది. ఇక 80సీ కింద మినహాయింపులు ఉండనే ఉంటాయి.

అయితే ఇప్పుడు.. ఐదు లక్షల వరకూ మినహాయింపు ఆప్షన్ ఎంచుకుంటే… 80సీ మినహాయింపులేమీ ఉండవు. అంటే.. ఐదు లక్షలకు మించి.. ఎంత ఆదాయం వచ్చినా పది శాతం పన్ను కేటగిరిలోకి చేరిపోతారు. రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను , రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం , రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం , 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. గతంలో.. కంటే.. ఓ ఐదు సాతం వరకూ తగ్గించారు. అంటే.. అధికా ఆదాయం ఉన్న వారికి కాస్త వెసులుబాటు ఉన్నట్లు అయింది.

పన్ను చెల్లింపుదారులు కొత్త లేదా పాత శ్లాబ్ ఎంచుకునే అవకాశం కల్పించింది. కొత్త శ్లాబ్ ఎంచుకుంటే 80(సి) కింద ప్రయోజనాలు ఉండవు. కొత్తవిధానాన్ని ఎంచుకుంటే ఎన్ని బీమాలు చేయించుకున్నా.. పన్ను మినహాయింపు రాదు. మొత్తంగా చూస్తే.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విత్తమంత్రి నిర్మలమ్మ.. ఉత్తచేయి చూపించారని అనుకోవచ్చు. మొత్తంగా ఎడు శ్లాబ్‌లు పెట్టినప్పటికీ.. వాటిలో.. నెలకు.. లక్షన్నర వరకూ జీతం పొందే వారికి… కాస్త మిగులు కల్పించే ప్రయత్నం చేశారు. మిగిలిన వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close