అమరావతి రీ స్టార్ట్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించిన ప్రభుత్వం ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ నెలలోనే ఇప్పటికే ఆ ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మోదీ చేత ఆ ప్రారంభం ఏదో చేయిస్తే పనులు .. రీస్టార్ట్ చేయవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన పనుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చారు.
అయితే మోదీ ఏపీకి రావాలంటే చాలా సమీకరణాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఓపెనింగ్, శంకుస్థాపనలు చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికి మే రెండో తేదీ ఖరారు అయినట్లుగా మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే అది ఫైనలా కాదా అన్నది మాత్రం.. ముందు ముందు క్లారిటీ వస్తుంది.
అమరావతిలో పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టులు పొందిన సంస్థలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కావాల్సిన మౌలిక సదుపాయాలను అమరావతికి తరలించుకుంటున్నాయి. భారీ యంత్రాలతో పనులు చేయనున్నారు. అలాగే మ్యాన్ పవర్ ను సమీకరించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడేళ్లలో కోర్ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీ రీస్టార్ట్ చేసిన వెంటనే పనులు అధికారికంగా పరుగులు పెట్టనున్నాయి. అమరావతికి నిధుల సమస్యే లేదు.