కాంగ్రెస్ పార్టీని వలస ఫీవర్ పట్టుకుంది. టీఆర్ఎస్ లో చేరబోతున్నానని ఎప్పుడు ఏ నేత ప్రకటిస్తారనే ఆందోళన మాత్రమే కాదు.. అందుకు తగ్గట్లుగా వస్తున్న పుకార్లు కూడా… పీసీసీ ముఖ్యుల్ని నిద్రపట్టనీయడం లేదు. తాజాగా ఎవరూ ఊహించని పేరు ఒకటి బయటకు వచ్చింది. అదే .. అజహరుద్దీన్ చేరిక. కాంగ్రెస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అహజరుద్దీన్.. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్న ప్రచారం ఒక్క సారిగా తెలంగాణ భవన్ లో గుప్పుమంది. అజహరుద్దీన్… గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఓ సారి యూపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మరోసారి రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న సమయంలోనే… ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ నియమించారు. చురుగ్గా ప్రచారం చేశారు కూడా.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. గెలుపు అవకాశాలు ఉంటాయో లేదోనన్న కారణంతో.. ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావన ఉంది. అయితే.. అజహరుద్దీన్ చేరిక అంశంపై… టీఆర్ఎస్ అధినాయకత్వం భిన్న కోణాల్లో ఆలోచిస్తోంది. ముందుగా.. మజ్లిస్ కోణం నుంచి… విశ్లేషణ చేస్తున్నారు. అజహరుద్దీన్ లాంటి … నేతను … చేర్చుకోవాలంటే.. కచ్చితంగా.. మజ్లిస్ నేతలు సుముఖత వ్యక్తం చేయాల్సి ఉంటుంది. తమకు పోటీ అవుతారని.. మజ్లిస్ భావిస్తే మాత్రం .. టీఆర్ఎస్ కూడా… అజరుద్దీన్ చేరికను లైట్ తీసుకునే అవకాశం ఉంది. దీనిపై టీఆర్ఎస్ లో ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.
మరో వైపు ఎమ్మెల్యేల చేరికలపై.. రోజుకొకరి పేరు బయటకు వస్తోంది. తాజాగా… శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిల పేర్లు బయటకు వచ్చారు. అయితే వారు ఈ ప్రచారాన్ని ఖండించారు. టీఆర్ఎస్లో చేరడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నామని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కరీంనగర్ జిల్లాకు జిల్లాకు వస్తున్నారనే కలుస్తున్నామని వెల్లడించారు. మొత్తానికే.. చేరికలపై ఏది నిజమో.. ఏది అబద్దమో కానీ.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం గందరగోళంలో ఉన్నట్లుగా ఉంది.