ఒకనాటి ప్రముఖ బాలీవుడ్ గాయకుడు స్వర్గీయ మహమ్మద్ రఫీ కుమారుడు సాహీద్ రఫీ శుక్రవారం ముంబాయిలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రాహుల్ గాంధి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాహీద్ రఫీ ఇది వరకు మజ్లీస్ పార్టీ తరపున ముంబైలో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి మజ్లీస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దక్షిణ ముంబైలోని మలాడ్ అనే ప్రాంతంలో గల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమానికి రాహుల్ గాంధి ఇవ్వాళ్ళ వచ్చినపుడు సాహీద్ రఫీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వంలో ముంబైలో ఏర్పాటు చేయబడ్డ పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ తమ పార్టీలో విలీనం అయిందని కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది.