మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఇటీవలి కాలంలో… లోటస్ పాండ్ చుట్టుపక్కలే కనిపిస్తున్నారు. జగన్ పెదనాన్న కుమార్తెను పెళ్లి చేసుకున్న విష్ణు …లోటస్ పాండ్లో జగన్తో సమావేశమై తరచూ మీడియాకు లీకులిస్తున్నారు. తాడేపల్లిలో గృహప్రవేశానికి హాజరై ఫోటో షూట్ చేయించుకుని… మరీ మీడియాకు విడుదల చేయించారు. అప్పుడప్పుడూ.. మంచు మోహన్ బాబు…టీడీపీపై ఎటాక్ చేయడానికి రెడీ అయి ఉంటారు. సినిమా ఫంక్షన్లకు వెళ్లినా.. చంద్రబాబును విమర్శించి… ఆ పంక్షన్ను స్వార్థానికి వాడుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. తాజా ఆయన కొంత కాలం నుంచి… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు… చంద్రబాబు అలవి కాని హామీలిస్తున్నారని.. తిరుపతిలో ప్రెస్మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.
విషయం ఏమిటంటే.. ఆయన విద్యా సంస్థలకు 2014 నుంచి రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదట. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడంలేదట. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని చెప్పుకొచ్చారు. తన విద్యాసంస్థలకు ప్రబుత్వం అడిగిన నిధులు ఇవ్వలేదు కాబట్టి.. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్కు చిత్తశుద్ధిలేదని తేల్చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి…అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని కూడా ప్రశ్నిచారు. ఏపీలో విద్యానికేతన్ ఒక్కటే కాదు.. కొన్ని వందల ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలవి చెందినవి ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ 2014 నుంచి రాకపోతే వారు ఎందుకు ఊరుకుంటారు..? ఒక్క మోహన్ బాబే.. దీనికి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో ఆయనకే తెలియాలి.
ఇటీవలి కాలంలో ఆయన .. ఆయన కుమార్తె..రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తానని.. ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పనని గతంలోనే ప్రకటించారు. అలా ప్రకటిస్తే.. తన వద్దకు పార్టీలు పరుగెత్తుకుంటూ వస్తాయని ఆయన అనుకున్నారు. కానీ బంధువు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోవడంతో… ఇప్పుడైనా పట్టించుకోవాలని ఇలా విమర్శలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగరితో పాటు చిత్తూరు జిల్లాలోని ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ఆశ పడుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. జగన్ దృష్టిలో పడటం కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.