గుణశేఖర్ చేస్తున్న సినిమా `శాకుంతలమ్`. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. శకుంతలగా…. సమంత నటిస్తోంది. సమంతనే ఈ సినిమాకి సేలబుల్ పాయింట్. అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది గుణశేఖర్ ప్లాన్. ఈరోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అభిజ్ఞాన శాకుంతలంలో.. శకుంతల పాత్ర ఎంత కీలకమో… దుర్వాస మహర్షి పాత్ర కూడా అంతే కీలకం. ఈ పాత్రని ఇప్పుడు మోహన్ బాబు పోషిస్తున్నారు. దుర్వాస మహర్షి.. ముక్కోపి. క్షణాల్లో శపించేస్తాడు. ఆ కోపం చెల్లారగానే… శాపానికి విరుగుడూ చెబుతాడు. శకుంతలని శపించి – ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది… దుర్వాస మునే. మోహన్ బాబు వ్యక్తిత్వమూ అంతే. తనకూ కోపం ఎక్కువ. అయితే అదీ కాసేపే. అందుకనేనేమో.. ఈ పాత్రకు గానూ.. మోహన్ బాబుని ఎంచుకున్నాడు గుణశేఖర్. మిగిలిన కీలకమైన పాత్రల్లో… పేరున్న నటీనటుల్ని ఎంచుకోవాలన్నది గుణశేఖర్ ఆలోచన. మున్ముందు ఆ వివరాలన్నీ బయటకు వస్తాయి.