టీవీ జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ రాలేదు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయనకు కోర్టు ఇచ్చిన రిలీఫ్ 24వ తేదీతో ముగిసిపోయింది. ముందస్తు బెయిల్ కూడా రాలేదు. ఈ వయసులో ఎక్కడ జైలుకు వెళ్తామన్న ఉద్దేశంతో ఆయన ముందు జాగ్రత్తగా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారో కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. దుబాయ్ లో ఉన్నారని కొంత మంది చెబుతున్నారు.
గడువు ముగిసిన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేస్తామని పోలీసు కమిషనర్ చెప్పారు. కానీ వారం అవుతున్నా నోటీసులు జారీ చేయలేదు. నోటీసులు జారీ చేస్తే అరెస్టు నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు హాజరై.. ఏదో విధంగా అరెస్టు చేయకుండా విచారణకు సహకరిస్తానని ఒప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ పోలీసులు నోటీసులు జారీ చేయలేదు. ఇప్పుడు కనిపిస్తే వారు అరెస్టు చేయవచ్చు. అసలే టాలీవుడ్ విషయంలో సీఎం రేవంత్ అసహనంతో ఉన్నారని అంటున్నారు. ఇలాంటి అవకాశాలు దొరికితే పోలీసులు వదిలి పెట్టే అవకాశం ఉండదు.
అందుకే మోహన్ బాబు అజ్ఞాతం నుంచి బయటకు రాలేకపోతున్నారు. తాను ఇలా దాక్కుంటున్నానన్న భావన ఆయననూ స్థిమితంగా ఉండనిచ్చే పరిస్థితి లేదు. తన వయసు చాలా ఎక్కువ అని.. తనకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. మతి మరుపు కూడా ఉందని ఆయన కోర్టుకు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. అరెస్టు చేస్తే బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మోహన్ బాబు అటు బయటకు రాలేక.. ఇటు అజ్ఞాతంలో ఉండలేక ఇబ్బంది పడుతున్నారని అనుకోవచ్చు. పోలీసులు ఈ కేసు విషయంలో ఏ స్టాండ్ తీసుకుంటారన్నదానిపై మోహన్ బాబు టెన్షన్ ఆధారపడి ఉంటుంది.