మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరించడం, కోర్టు ఇచ్చిన రిలీఫ్ మంగళవారంతో ముగియనుండటంతో ఆయన ముందు జాగ్రత్తగా దుబాయ్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. గతంలో హైకోర్టు పోలీసులు ఇచ్చిన నోటీసులపై 24వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం లేదు. ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరింతడంతో అరెస్టు నుంచి రక్షణ కల్పించే అవకాశాలు లేవు.
మోహన్ బాబు ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తన వద్ద ఉన్న తుపాకీల్ని సరెండర్ చేశారు. కానీ హత్యాయత్నం కేసు మాత్రం బలంగా నిలబడింది. పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. కుటుంబపరమైన సమస్యల్లో కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్దంగా లేరు. అందుకే ఇప్పటి వరకూ వారి కుటుంబ గొడవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేయలేదు. కానీ మీడియా ప్రతినిధిపై దాడి కేసు మాత్రం ఆయనకు సమస్యగా మారింది.
ఇప్పటికే మోహన్ బాబు అందుబాటులో లేరు. ఆయన దుబాయ్ వెళ్లారని.. చెబుతున్నారు. వెళ్లి వచ్చారని పోలీసులకు అందుబాటులో ఉంటారని లాయర్లు చెబుతున్నారు కానీ.. అరెస్టు ముప్పు ఉంటే మాత్రం తదుపరి న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునేవరకూ ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఆయన ఆస్పత్రిలో బాధితుడ్ని పరామర్శించి మరో తప్పు చేశారని పోలీసు వర్గాలంటున్నాయి. మొత్తంగా మోహన్ బాబు కష్టాలు కొనసాగనున్నాయి.