ఎందుకు వచ్చాయో,ఎలా వచ్చాయో కానీ మంచు కుటుంబంపై ఉన్నంత ట్రోలింగ్ పరిశ్రమలో మరే ఫ్యామిలీపై లేదు. దీనికి తోడు ఇప్పుడు మంచు ఫ్యామిలీ స్వయంక్రుతాలు కూడా తోడయ్యాయి. ఇటివలే మంచు బ్రదర్స్ వీడియో వైరల్ గా మారింది. మనోజ్, విష్ణు ల మధ్య గొడవలు వున్నాయనే సంగతి అందరికీ తెలిసింది. దీనిని కవర్ చేసుకోవడానికి విష్ణు రిలీజ్ చేసిన ‘హౌస్ అఫ్ మంచుస్’ కూడా ఫేక్ తేలిపోయింది.
తాజాగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు మరింత అప్రతిష్ట తెచ్చేలా వున్నాయి. ఓ హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్ళిన మోహన్ బాబుకి ఇంట్లో జరిగిన గొడవ గురించి అడిగితే.. చాలా విచిత్రమైన సమాధానం ఇచారు. ‘’మీ ఇంట్లో నీకు నీ భార్యకు సంబంధం ఏమిటో చెప్పగలవా ?’’ అని రివర్స్ లో ఎవరికీ అర్ధం కానీ ఓ ప్రశ్న వేశారు.
గొడవ గురించి అడిగితే.. తెలీదని చెప్పాలి, అన్నదమ్ముల మధ్య ఎదో చిన్న మాట పట్టింపు అనాలి, లేదా విష్ణు చెబుతున్నట్లు అదంతా రియాలిటీ షో అనాలి.. అంతే గానీ మీడియా ముందు సహనం కోల్పోయినట్లు ఈ మొరటు వ్యాఖ్య ఏమిటో అర్ధం కావడం లేదు.
మోహన్ బాబు వున్నది వున్నట్లు మాట్లడే మనిషి అనే పేరుంది. గొడవ గురించి అడిగినప్పుడు అసలు విషయం ఏమిటో చెప్పాలి. లేదా సందర్భం కాదు అనేయాలి. అంతేగానీ హుందా వ్యవహరించాల్సిన చోట ఇలా అసందర్భంగా మాట్లాడటం అంటే మనల్ని మనం పలుచన చేసుకున్నట్లే.
మనోజ్ కూడా సహనం కోల్పోయాడు. రీసెంట్ ఇష్యూ మీద క్లారిటీ ఇస్తారా ? అనే ప్రశ్నకు ‘’రీసెంట్ గా సెగ్గడ్డ వచ్చింది’’ అని కౌంటర్ ఇస్తూ వీపు చూపించారు. మనోజ్ ఇది గొప్ప సెటైర్ అనుకున్నాడేమో కానీ తనని తానే చులకన చేసుకున్నాడనే సంగతి అర్ధం చేసుకోలేకపోయాడు.
మోహన్ బాబు, విష్ణు,లక్ష్మీతో పోల్చుకుంటే మనోజ్ పై ట్రోలింగ్ తక్కువ. ఇలాంటి కామెంట్లు పాస్ చేస్తే.. మనోజ్ కూడా అనవసరమైన ట్రోలింగ్ కి గురి కావాల్సివస్తుంది. జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇవ్వకుండా ఇలా అడ్డ దిడ్డంగా మాట్లాడితే తమని తామే తగ్గించుకోవడం అవుతుంది తప్పితే మరొకటి కాదు.