కాస్త విరామం తరవాత మోహన్ బాబు మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. `సన్ ఆఫ్ ఇండియా` సినిమాతో. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈరోజే.. హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి మోహన్ బాబునే నిర్మాత. ఆన్నట్టు ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. మోహన్‌బాబు – ఇళయరాజాలది మంచి కాంబో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమాకి స్టైలీష్‌గా మంచు విష్ణు భార్య విరానిక వ్యవహరిస్తోంది. మోహన్ బాబు కాస్ట్యూమ్స్, స్టైల్… ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించనున్నాయని టాక్. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కొంతమంది బాలీవుడ్ నటీనటులు కూడా కనిపించబోతున్నట్టు టాక్.