తన తండ్రి ఆస్తులేమీ ఇవ్వలేదని.. తానే సంపాదించుకున్నానని ఆస్తులు సమానంగా పంచుతానా లేదా అనేది తన ఇష్టమని మంచు మనోజ్ కు మోహన్ బాబు స్పష్టం చేశారు. ఆయనను ఉద్దేశించి ఓ ఆడియోను విడుదల చేశారు. ఎంతో గారాబంగా పెంచుకున్నానని చదువు కోసం చాలా ఖర్చు పెట్టాననని భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావ్ అని ఆడియోలో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని.. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డామన్నారు. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావని ఆరోపించారు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదని స్పష్టం చేశారు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లని తేల్చి చెప్పారు.ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. వద్దా అనేది నా ఇష్టమని మోహన్‌బాబు స్పష్టం చేశారు. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టమని .. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, అయినా నేను సంపాదించుకున్నానని మోహన్ బాబు తెలిపారు.
మళ్లీ తప్పు చేయనని చెప్పి ఇంట్లోకి వచ్చావని.. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం అని మోహన్ బాబు ప్రశ్నించారు. మంచు మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉంది. నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదని మోహన్‌బాబు తెలిపారు. జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరిందన్నారు. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తానన్నారు. మోహన్ బాబు ఆడియో వైరల్ గా మారింది.