తదుపరి విచారణ వరకూ మోహన్ బాబును అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పినా.. జర్నలిస్టు చూపించే ఔదార్యాన్ని బట్టే ఆయనకు తర్వాత రిలీఫ్ దక్కే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో తదుపరి విచారణలోపు మోహన్ బాబు జర్నలిస్టును సంతృప్తి పరిచి.. క్షమించానని అనిపించుకోవాల్సి ఉంది. నష్టపరిహారం కోరుకుంటున్నారా అన్న అంశంపై సుప్రీంకోర్టు అభిప్రాయం తెలుసుకోనుంది.
అయితే జర్నలిస్టు మాత్రం.. తనను పరామర్శించడానికి వచ్చి బెదిరించారని అంటున్నారు. సుప్రీంకోర్టులో ఆయనతరపు లాయర్ అదే వాదించారు. పరామర్శ పేరుతో వచ్చి కేసును విత్ డ్రా చేసుకోవాలని కోరారన్నారు. అలాంటిదేమీ లేదని మోహన్ బాబు లాయర్ వాదించారు. జర్నలిస్టు కూడా బహిరంగంగా నష్టపరిహారానికి అంగీకరించి.. కేసును విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు. కానీ లోపాయికారీగా మోహన్ బాబు తిరస్కరించలేనంత ఆఫర్ ఇచ్చి కేసును సెటిల్ చేసుకోవచ్చు. జర్నలిస్టు కుటుంబంతో సంప్రదింపులు జరిపి.. ఆయనకు జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చి సుప్రీంకోర్టులో పాజిటివ్ గా తన లాయర్ తో చెప్పించుకోవచ్చు.
పరిహారం తీసుకున్నట్లుగాబయటకు తెలిస్తే జర్నలిస్టుకు కూడా సమస్యే. అందుకే ఏదైనా సీక్రెట్స్ గా డీల్ చేసుకుంటే.. తర్వాత విచారణలో జర్నలిస్టు తరపు న్యాయవాది .. చర్యలు అవసరం లేదని విచారం వ్యక్తం చాలని చెప్పే అవకాశం ఉంటుంది. ఈ దిశగా మోహన్ బాబు తరపున కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా అడిగినంతో.. ఇవ్వగలిగినంతో ఇచ్చి సెటిల్ చేసుకోవడం తప్ప మోహన్ బాబుకు మరో మార్గం లేదు.