దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో మోహన్‌లాల్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ లో సాధారణ ప్రేక్షకులకు అనుమతి లేదు. కేవలం వీఐపీలకే మ్యాచ్ చూసే అవకాశం దక్కింది. ఆ వీఐపీ గ్యాలరీలో.. మోహన్ లాల్ కనిపించాడు. కేవలం సౌత్ ఇండియా స్టార్ గా మోహన్ లాల్‌కి ఆ గౌరవం దక్కిందనుకుంటే పొరపాటే. వచ్చే ఐపీఎల్ లో మోహన్ లాల్ జట్టు కూడా కనిపించబోతోంది. అందుకే… మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చాడని సమాచారం.
ఈ ఐపీఎల్ లో 8 జట్టు తలపడ్డాయి. వచ్చే ఐపీఎల్ లో కొత్త జట్టు రాబోతోందని సమాచారం. గుజరాత్ జట్టు ఈసారి రంగ ప్రవేశం చేస్తుందని, ఆ జట్టుకి మోహన్ లాల్ యజమానిగా ఉంటాడు తెలుస్తోంది. ఐపీఎల్ 2021కి సంబంధించిన ఆక్షన్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆక్షన్‌కి రెడీగా ఉండమని ఫ్రాంజైజీలకు బీసీసీఐ సమాచారం అందించిందట. అంతేకాదు.. ఈ సారి కొత్త జట్టు రాబోతోందని సంకేతాలు పంపిందట. ఆ జట్టు గుజరాత్ అని తెలుస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆ గ్రౌండే గుజరాత్ జట్టుకి సొంత మైదానం కానుందట.