” మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ ” మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్యానల్ తరపున గెలిచిన వారందరూ ప్రమాణం చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వాళ్లు ప్రమాణానికి రాలేదు. ప్రమాణస్వీకారం తర్వాత మోహన్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా “మా” ఎన్నికల్లో ఎన్నో రాజకీయాలు జరిగాయని అవన్నీ అవసరమా అని ప్రశ్నించారు. ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో అన్నీ తెలుసని.. అయినా తాము ఎలాంటి వ్యక్తిగత, రాగ ద్వేషాలు లేవని అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తాము బెదిరించారని అంటున్నారని.. కానీ తమనే బెదించారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
“మా” పదవిచిన్న వ్యవస్థ కాదని..900 కుటుంబాల భవిష్యత్ ను నిర్దేశిస్తుందన్నారు. కళాకారుల కోసం పనిచేయాలి కానీ రాజకీయాలెందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఏం జరిగినా ఇక ముందు కలిసి పని చేద్దామన్నారు. త్వరలోసీఎం కేసీఆర్ ను కలుస్తామన్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ నూ కలిసి సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలనికోరుతామన్నారు. అందరూ కలిసి మాట్లాడుకోవాలని.. అంతే కానీ మీడియాలో సమావేశాలు పెట్టి రచ్చరచ్చ చేయవద్దని హితవు పలికారు.
అయితే నరేష్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు. ఆయన అయిందేదో అయిపోయిందంటూ కాస్త రెచ్చగొట్టేలామాట్లాడారు. తాను ఖచ్చితంగా “మా”ను అంటి పెట్టుకునే ఉంటానని ప్రకటించారు. ప్రస్తుత కార్యవర్గం ప్రమాణం చేయడంతో నరేష్‌కు ఎలాంటి బాధ్యతలు .. పదవులు లేవు. అయినా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికే ఆయన ఇలాంటి ప్రకటనలు చేసినట్లుగా భావిస్తున్నారు. మా ఎవరి సొత్తు కాదని.. ఆయన కృష్ణం రాజు అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి తలసాని హాజరయ్యారు. ఆయన మోహన్ బాబుపై ప్రశంసలు కురిపించారు. మోహన్ బాబు ఆవేశం, కోపం ఆయనకే నష్టాన్ని చేసింది… ఎవరికి కష్టం వచ్చినా స్పందించే వ్యక్తి మోహన్ బాబ అని పొగడ్తలు కురిపించారు. అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల తరహాలో మా ఎన్నికలు జరిగాయని.. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం మంచు విష్ణుకు సహాకారం అందిస్తుందన్నారు. అందరూ కలిసి మెలిసి ఉండాల్సిన సమయం ఇదని తలసాని సూచించారు..