హైదరాబాద్ పోలీసులు ప్రముఖ జర్నలిస్టు, మాజీ మోజో టీవీ సీఈవో రేవతిని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ఆమె ఇంటి వద్ద హడావుడి చేసిన పోలీసులు మధ్యాహ్నానికల్లా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో… శబరిమల ఇష్యూ.. దేశంలో కలకలం రేపుతున్నప్పుడు.. మోజో టీవీలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ చర్చా కార్యక్రమానికి వచ్చిన ఓ వ్యక్తి.. తనను స్టూడియోలో.. మోజో టీవీ కార్యాలయంలో.. కులం పేరుతో దూషించారని.. ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసి చాలా కాలం అయింది… అప్పట్లో ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు కానీ… సమయం రాగానే.. పోలీసులు …. చట్టాన్ని తన పని తాను చేసుకుపోయేలా చేయగలిగారు.
టీవీ9 అమ్మకం వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి.. మోజో టీవీ కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ చానల్ రవిప్రకాష్దేనని ప్రచారం జరిగింది. అదే సమయంలో.. టీవీ9కి చెందిన నిధులను.. మోజో టీవీ కోసం మళ్లించారన్న ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. మోజో టీవీని కూడా… ప్రముఖ వ్యాపారవేత్త.. రామేశ్వరరావు బృందం స్వాధీనం చేసుకుంది. మోజో టీవీ చైర్మన్ చేరెడ్డి హరికిరణ్‌ను పోలీసులతో బెదిరించి.. చానల్‌ను కబ్జా చేస్తున్నారని.. ఎన్నికల ఫలితాలకు ముందు రోజు… రాత్రి… స్టూడియోలోనే.. నిరాహారదీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ వివాదం హఠాత్తుగా సద్దుమణిగిపోయింది. ఎందుకంటే… ఆ తర్వాతి రోజే.. మోజో టీవీ కొత్త వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. డైరక్టర్ గా ఉన్న సీఈవో రేవతిని కూడా సంస్థ నుంచి తొలగించారు. రఘు అనే మరో యాంకర్ కమ్ జర్నలిస్టును కూడా సంస్థ నుంచి పంపిచేశారు.
రేవతి, రఘులపై… గతంలోనే.. కేసులు పెట్టారు. ఆరు నెలల ముందు చేసిన ఫిర్యాదును… ఎన్నికల ఫలితాలకు ముందు రోజు బయటకు తీసిన పోలీసులు రఘు, రేవతిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కూడా. అయితే.. అప్పుడు నోటీసులు మాత్రమే ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు… వ ారిని సంస్థ నుంచి పంపించి వేసినప్పటికీ… పోలీసులు మాత్రం.. చట్ట ప్రకారం చర్యలు కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. రామేశ్వరరావు ఇంటిపై.. ఐటీ దాడులు జరిగినప్పుడు.. సోషల్ మీడియాలో.. రేవతి… విపరీతంగా ప్రచారం. ఈ క్రమంలోనే.. రేవతి అరెస్ట్ చోటు చేసుకుంది.