నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని వెండి తెరపై చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. అయితే అది అందరి ద్రాక్షగానే మిగిలిపోతోంది. బోయపాటి నుంచి క్రిష్ వరకూ చాలామంది పేర్లు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కోసం పరిశీలనకు వచ్చాయి. అయితే.. అవేం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకొచ్చింది. తనే…. రాహుల్ సంకృత్యయిన్. టాక్సీవాలా, శ్యాం సింగరాయ్ చిత్రాలతో ఆకట్టుకొన్నాడు రాహుల్. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ఓ కథ తయారు చేశాడని తెలుస్తోంది. ఇటీవల మోక్షజ్ఞని కలిసి కథ వినిపించాడని, ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖాయమని సమాచారం. ఇదో లవ్ స్టోరీ అని 2023 ప్రధమార్థంలో పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఇటీవల మోక్షజ్ఞ తన పుట్టిన రోజు వేడుకల్ని టర్కీలో చేసుకొన్నాడు. అక్కడ బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడికి… రాహుల్ కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. బాలయ్యది మాస్ ఇమేజ్. అయితే.. మోక్షజ్ఞని సరికొత్తగా, ఈ ఇమేజ్‌కు దూరంగా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే లవ్ స్టోరీని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది.