నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలు కావాల్సివుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఫిబ్రవరిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని మొదలెట్టాలని భావించారు. అయితే ఇప్పుడు ఇంకాస్త లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మోక్షజ్ఞ విదేశాలకు వెళ్లబోతున్నాడట. అక్కడ తన సినిమాకు సంబంధించిన డిస్కర్షన్స్ మొదలు కాబోతున్నాయని తెలుస్తోంది.
మోక్షు ఇంకా డైలామాలో ఉన్నాడని, తొలి సినిమా ఎవరితో చేయాలన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, అందుకే ఇంత సమయం తీసుకొంటున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ కథ రెడీ చేసేశాడు. ప్రశాంత్ వర్మ కథనే ఫైనల్ చేస్తే ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలైపోతుంది. లేదూ.. మరో కథతో వెళ్దామంటే కనీసం మరో మూడు నెలలైనా టైమ్ పడుతుంది.
ఒకవేళ మోక్షజ్ఞ మరో దర్శకుడితో కమిట్ అయితే – `హనుమాన్ 2` సినిమాని పట్టాలెక్కిస్తాడు ప్రశాంత్ వర్మ. `బ్రహ్మరాక్షస్` స్క్రిప్టు వర్క్ కూడా తుది దశలో వుంది. ఈ రెండు ప్రాజెక్టుల బిజీలో మోక్షజ్ఞ సినిమా లేట్ అయినా – ప్రశాంత్ వర్మ పెద్దగా వర్రీ అవ్వడం లేదు. ఎలాంటి స్క్రిప్టుతో తన కెరీర్ మొదలెట్టాలన్న నిర్ణయాన్ని బాలయ్య కూడా మోక్షజ్ఞకే వదిలేశాడని తెలుస్తోంది. విదేశాలకు వెళ్లొచ్చాకే.. తన ఎంట్రీ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్సుంది.