మోనాలిసా అని పేరు ఎందుకు పెట్టారో కానీ మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా భోంస్లే మాత్రం అందమంటే ఇలాగే ఉంటుందా అన్న ప్రచారాన్ని పొందుతున్నారు. మహా కుంభమేళాలో ఇప్పుడు ఎక్కువగా ఈమె గురించే చెప్పుకుంటున్నారు. సహజమైన అందం అని విపరీతంగా పబ్లిసిటీ చేసేస్తున్నారు.
ఈ మోనాలిసా భోంస్లే ఎవరంటే.. రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకునే కుటుంబానికి చెందిన యువతి. కుంభమేళాలు, హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి దండలు, రుద్రాక్షలు అమ్ముతూంటారు. ఇలా మహాకుంభమేళాకు వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నారు. ఎక్కడైనా దుకాణం పెడితే తండ్రికి సాయం చేసేందుకు మోసాలిసా వెళ్తుంది. అలా మోనాలిసా కూడా వెళ్లింది.
అక్కడ మోనాలిసా దుకాణం దగ్గర ఉన్న సమయంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. అమెకు లభించిన పబ్లిసిటీతో చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వ్యాపారం జరగడం లేదని కుమార్తెను ఇంటికి పంపేశాడు ఆమె తండ్రి. కానీ ఆమె కోసం వాకబు చేసేవాళ్లు ఎక్కువైపోయారు.
అయితే ఈ అందం ఖచ్చితంగా సినిమా వాళ్ల దృష్టిలో పడుతుందని సినిమా చాన్సులు వస్తాయని.. ఇవ్వాలని నెటిజన్లు స్పందిస్తున్నారు.