కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఐటీ, ఈడీ అధికారుల నోటీసులు ఇచ్చారు. నోటీసులతో పాటు, అభియోగాల కాపీలను అందజేశారు. రేవంత్‌రెడ్డికి ఐటీ యాక్ట్ 54, 55కింద నోటీసులు జారీ చేశారు. రేవంత్‌రెడ్డి ఫెమా, మనీలాండరింగ్ చట్టాలు ఉల్లఘించారని నోటీసుల్లో ఆరోపించారు. హవాలా మార్గంలో కోట్లాది రూపాయాలు సంపాదించారని అభియోగం మోపారు. విదేశాల్లోని రఘువరన్ మురళి అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి…ఒకేరోజు రూ.9కోట్లు రేవంత్‌రెడ్డి అకౌంట్లో జమ అయినట్లు గుర్తించారు. మురళికి, రేవంత్‌రెడ్డికి మధ్య చాలా ఆర్థికలావాదేవీలు జరిగినట్టు ఈడీ,ఐటీ అధికారులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి, ఆయన భార్య కలిపి రూ.11.5లక్షల ఇన్ కంట్యాక్స్ చెల్లిస్తున్నారని.. అలాంటప్పుడు ఇన్ని కోట్ల పెట్టుబడులు ఎలా పెట్టారని నోటీసుల్లో ఐటీ, ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి విదేశాల్లో ఆస్తులు కొని అమ్మారని.. ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ఈ మేరకు.. రేవంత్ రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో రోజంతా సోదాలు చేసింది. కొడంగల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి సాయంత్రానికి జూబ్లిహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో రేవంత్ కు .. పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాని ప్రకారం.. బ్లాక్ మనీ, ఇన్ కం ట్యాక్స్ చట్టం 2015, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ ఆక్ట్ 1988 , ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసులు నమోదు చేశారు.
2014 ఫిబ్రవరి 25న సింగపూర్‌లోని బహుళ అంతస్థుల అమ్మకంలో 20 లక్షల సింగపూర్ డాలర్లు అందుకున్నారని ఐటీ అధికారులు నోటీసుల్లో చెప్పారు. 2014లో ఒకే సారి… రేవంత్ రెడ్డికి చెందిన బ్యాంక్ ఎకౌంట్ లో రూ. 9 కోట్లు జమ అయ్యాయన్నారు. 25.02.2014న మలేషియాకు చెందిన మురళీ రాఘువరన్ దగ్గర నుంచి… రేవంత్‌రెడ్డి రూ.60 లక్షలు పొందినట్లు నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వివరాలను.. ఎన్నికల అఫిడవిట్లో, ఐటీ రిటర్న్స్‌లో రేవంత్ చూపించకపోవడంతో.. వివరాలు వెల్లడించాలని నోటీసుల్లో ఐటీ అధికారులు ఆదేశించారు. వివిధ ఖాతాల ద్వారా సింగపూర్, మలేసియాలలో ఆస్తులు కొనుగోలు చేశారని.. యాంటి కరెప్షన్ యాక్ట్ సెక్షన్ 1988 ఉల్లగించారని సోదా చేసిన అధికారులు ఆరోపిస్తున్నారు. అనుచరులు, బినామీలు, బంధువుల పేర్లతో షెల్ కంపెనీలు సృష్టించి…కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే లబ్ధి పొందినట్లు వారు చెబుతున్నారు. రేవంత్ కుటుంబ సభ్యుల పేరు మీద వ్యవసాయ భూములు…కమర్షియల్ ప్లాట్లు, బిల్డింగ్లు ఉన్నట్లు చెబుతున్నారు. వీటిని ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని ఆరోపిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చిన…ఆస్తుల వివరాల ప్రకారం ఐటీ రిటర్న్స్ సరిగా లేవని. దానికి సంబంధించిన వివరాలివ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
2014లో నల్లధనంతో మలేషియాలోని ఆస్తులు కొనుగోలు చేసి వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా తిరిగి వైట్ మనీ పొందారని ఐటీ అధికారులు అభియోగం మోపారు. 25.02.2014న రేవంత్‌రెడ్డి హాంకాంగ్ బ్యాంక్ అకౌంట్లో… రూ. 60 లక్షల విలువైన మలేషియన్ రింగెట్స్‌ని జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మును కౌలాంలంపూర్ వాసి రఘువరన్ మురళి… RHB బ్యాంక్ ద్వారా రేవంత్‌కు డబ్బు అందినట్లు గుర్తించారు. విదేశాల నుంచి రేవంత్ కు వచ్చిన సొమ్ము ఇండియన్ కరెన్సీలో…రూ. 10కోట్లకు పైగా ఉంది. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హవాల రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందినట్లు చెబుతున్నారు. రేవంత్ తన లావాదేవీల్లో ఫెమా రెగ్యూలేషన్ యాక్ట్, బినామీ లావాదేవీలు, లోన్స్ డైవర్టెడ్, మనీ ల్యాండరింగ్ యాక్టివిటీస్ ఉల్లఘించినట్లు విచారణ అధికారులు నోటీసుల్లో పేరొన్నారు. ఉదయం ఓటు కు నోటు కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ సింహా ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. నోటీసుల్లో వారంలోగా సమాధానం చెప్పాలని ఐటీ, ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.