వచ్చే ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జె్ రూ.2,26,177.53 కోట్లకు చేరింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు, కేపిటల్ వ్యయం రూ.29,596.33 కోట్లుగా నిర్ధారించారు. రెవెన్యూ మిగులు రూ.2,099.47కోట్లు కాగా.. ఆర్ధిక లోటు రూ.32,390.68 కోట్లుగా తేలింది. ఎన్నికల ఏడాది కావడంతో.. సంక్షేమ పథకాలకు అత్యధిక భాగం నిధులు కేటాయించాయి. పలు కొత్త పథకాలకు నిధులు మంజూరు చేశారు. రైతులకు నేరుగా సాయం అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని రూ. 5 వేల కోట్లు కేటాయించారు. డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు… రూ. 65,486 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
ఇందులోనూ.. సబ్ ప్లాన్స్ ప్రకటించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ. 14,367 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌కు రూ. 16,226 కోట్లు, మైనార్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 1,304 కోట్లు ఇచ్చారు. పసుపు- కుంకుమకు రూ. 4 వేల కోట్లు కేటాయించారు. బీసీ కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పెన్షన్ రెట్టింపు చేయడంతో… కేటాయింపు కూడా పెంచారు. బడ్జెట్ మొత్తం.. సంక్షేమ పథకాల చుట్టూనే తిరిగింది. వ్యవసాయానికి , సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. నేరుగా.. ప్రజలకు లబ్దిచేకూర్చే పథకాలకే.. ఎక్కువ నిధులు కేటాయింపులు జరిగాయి. జయహో బీసీ సభలో ప్రకటించిన విధంగా పథకాలకు కేటాయింపులు జరిపారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో 4.3 లక్షల మందికి లబ్ధి కలిగిస్తున్నట్లు 8.66 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించామన్నారు. ప్రైవేటు రంగాల ద్వారా 7.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని.. ప్రభుత్వ రంగంలో 42 వేల ఉద్యోగాల నియామకాలకు అనుమతుల ఇచ్చామన్నారు.
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి బడ్జెట్ ఏకంగా రూ. 35వేల కోట్లకుపైగానే పెరిగింది. గత ఏడాది ఏపీ బడ్జెట్ రూ.1,91,063.61 కోట్లు ఉండగా.. రెవెన్యూ వ్యయం రూ.1,50,270 కోట్లు. మూలధన వ్యయం రూ.28,678 కోట్లు. ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లుగా ఉంది. ఈ సారి బడ్జెట్ రూ. 35వేల కోట్ల పెరిగింది. లోటు కూడా.. దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెరిగింది.