దేశవ్యాప్తంగా ఎన్నికల పథకాల ట్రెండ్ మారుతోంది. గతంలో సంక్షేమం పేరుతో రకరకాల పథకాలు ప్రకటించేవారు. ఇలాంటి పథకాల ప్రకటనలో తమిళనాడుది ప్రత్యేక శైలి. గ్రైండర్లు, సైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఇలా అనేక వస్తువులను పంపిణీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో.. ఉచిత పథకాలు ఉంటున్నాయి కానీ.. అవి వస్తువు కాదు.. నగదు బదిలీ పథకాలే హైలెట్ అవుతున్నాయి. డీఎంకే చీఫ్ స్టాలిన్…తాము గెలిస్తే.. నెలకు రూ. వెయ్యి పంపిణీచేస్తామని ప్రకటించారు. అయితే అందరికీ కాదు. రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే. రేషన్ కార్డులు ఉన్న వారు తమిళనాడులో రెండు కోట్ల మంది ఉన్నారు.
దీంతో స్టాలిన్ హామీప్రకారం.. రెండు కోట్ల మందికి నెలకు రూ. వెయ్యి చొప్పున జీతం చెల్లించినట్లుగా చెల్లించాల్సి ఉంటుంది. స్టాలిన్ హామీ.. రేషన్ కార్డు దారుల్లో కొత్త ఆశలు చిగురింప చేశాయి. ఇదేదో ప్రజల్లోకి వెళ్లిందని అనుకున్నారేమో కానీ.. సీఎం పళని స్వామి మరింత ముందుకెళ్లారు. తాము రూ. పదిహేను వందలు ఇస్తామని ప్రకటించారు. పళని స్వామి అధికారంలో ఉన్నారు కాబట్టి.. మరిన్ని పథకాలు ప్రకటించారు. ఇప్పటికే వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించారు. బంగారంరుణాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్టాలిన్ విద్యారుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అన్న నగదుతో సంబంధించినవే. గతంలో వివిద రకాల వస్తువులు పంపిణీ చేసేవాళ్లు.
వాటికి ఆదరణ తగ్గిపోవడం.. లబ్దిదారులు కూడా తక్కువే ఉంటున్నారన్న ఆరోపణలు రావడంతో పాటు… నేరగా ప్రజలకు డబ్బులు అందితే.. వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుందన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు నగదు బదిలీని చేపట్టాయి. ఎవరేం చేసినా ట్రెండ్స్‌లో ఒకింత ముందే ఉండే… తమిళనాడు.. నగదు బదిలీ పథకాల్లోనూ తనదైన ప్రత్యేకతను చూపుతోంది.