గత వారం ఐ ప్యాక్ చేసిన ఓ సర్వే లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది లీక్ కాబట్టి చాలా మంది నమ్మలేదు. ప్రతి ఆరు నెలలకోసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియాటుడే టీవీ చానల్ ప్రకటించే సర్వేలో అదే నిజమని స్పష్టం అయింది. రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రకటించిన తాజా సర్వే ప్రకారం ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పదిహేను లోక్ సభ సీట్లు టీడీపీకి వస్తాయి. ఇండియా టుడే కేవలం లోక్ సభ సీట్ల గురించే ప్రొజెక్షన్ ఇస్తుంది.
టీడీపీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని… ఆ పార్టీ మాత్రమే ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీగా ఉంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రోగ్రామ్ లో సెఫాలజిస్టులు అంచనా వేస్తారు. ఇదే సర్వేలో ఏడాది కిందట టీడీపీకి ఏడు లోక్ సభ సీట్లు వస్తాయని విశ్లేషించారు. ఆ తర్వాత పది సీట్లు వస్తాయన్నారు. ఈ ఆరు నెలల్లో పదిహేను సీట్లకు పెరిగింది. మొత్తంగా జనసేన పార్టీ ఉనికి అసలు కనిపించడం లేదు. పొత్తులు లేకుండానే ఈ ఫలితాలు వస్తాయని తెలిపారు. ఐ ప్యాక్ సర్వేలోనూ అదే ఉంది.
ఇటీవల టైమ్స్ నౌ చానల్ తో.. ప్రతీ నెలా ఓ సర్వే వస్తోంది. అందులో ఇరవై ఐదు సీట్లూ వైసీపీకే వస్తాయని వేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లోనూ వైసీపీ పట్టు జారిపోయిదని స్పష్టమయింది. తమ సిట్టింగ్ పంచాయతీలు, కంచుకోటల్లోనే ఓడిపోయింది. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో జగన్ రెడ్డి గ్రాఫ్ దారుణంమగా కరిగిపోతోంది. ఎన్నికలు జరగడానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి పథకాల డబ్బులు ఇవ్వలేకపోతున్నారు.
జగన్ రెడ్డి పని అయిపోయిందని తెలిస్తే… టీడీపీ ఎన్డీఏలో చేరడానికి సిద్ధమైతే.. ఇక కేంద్రం నుంచి సహకారం లభించదు. ఆ తర్వాత జగన్ రెడ్డి చేయడానికి ఏమీ ఉండదు. ఎన్నికలకు ముందే పూర్తిగా చేతులెత్తేసినా ఆశ్చర్యం లేదు.