మాదక ద్రవ్యాల ప్యాకెట్లను శరీరంలో దాచుకొని దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చి పట్టుబడిన మూసా కడుపులో నుండి సుమారు కోటి రూపాయల విలువగల 51 ప్యాకెట్లను ఉస్మానియా వైద్యులు సురక్షితంగా బయటకు తీసిన తరువాత మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసారు. మాదకద్రవ్యనిరోదోక శాఖా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ లో ఉన్న తమ కార్యాలయానికి తరలించ ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాదక ద్రవ్యాలతో ఇదివరకు పోలీసులకు పట్టుబడ్డారు. కనుక మూసా ఇవ్వబోయే సమాచారం సినీ పరిశ్రమని కూడా ఒక కుదుపు కుదిపే అవకాశం ఉంది.