వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి .. పార్టీలో నేతలంతా అనామకులని.. తాను పదవులిస్తే అనుభవిస్తారు.. మూలన కూర్చోమంటే కూర్చుంటారని అనుకుంటున్నారు. అందుకే విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే జగన్ రెడ్డి అనుకుంటున్నట్లుగా వారెవర్నీ జగన్ రెడ్డి రాజకీయంగా పుట్టించలేదు. పెంచలేదు కూడా. జగన్ రెడ్డి కంటే ముందే వారి సొంత రాజకీయాలతో ఎదిగారు. ఇప్పుడు జగన్ రెడ్డి పక్కన పెడతానంటే ఊరుకుంటారా ?. తమ రాజకీయాలు తాము చేస్తారు. మోపిదేవి అదే చేస్తున్నారు.
మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు రాజకీయ జీవితాన్ని ముగించేందుకు జగన్ రెడ్డి రేపల్లె అసెంబ్లీకి కొత్త అభ్యర్థిని తెచ్చి పెట్టారు. నిజానిని అభ్యర్థిగా ప్రకటించిన ఈపూరి గణేష్ కొత్త అభ్యర్థి కాదు. టీడీపీ మాజీ మంత్రి ఈపూరి సీతారావమ్మ కుమారుడు. గతంలో పీఆర్పీ నుంచి కూడా పోటీ చేశారు. ఆయనలో ఏం చూశారో కానీ.. పిలిచి అవకాశం ఇచ్చారు. ఇది మోపిదేవి వర్గాన్ని నిరాశకు గురి చేసింది. ఇలా వదిలేస్తే తన పని అయిపోయిందని.. మత్స్యకార వర్గాలను తెరపైకి తెచ్చారు. మోపిదేవికి టిక్కెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపించారు. తాడేపల్లిలోనే ఈ సంఘాలన్నీ సమావేశమయ్యారు.
మత్స్యకారుల పొట్ట కొట్టేలా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై వారిలో తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే ఉంది. అదే కారణమా లేకపోతే.. వారు ఓట్లేయరన్న కారణంగా పక్కన పెట్టడం మంచిదని అనుకుంటున్నారో కానీ జగన్ సీనియర్ నేతను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మోపిదేవి ప్రారంభించారు. ఇతర నేతలు కూడా తర్వాత ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.