విశాఖ కన్నా కడప పట్టణంలోనే బార్లకు ఫుల్ డిమాండ్. ఒక్కో బార్‌కు ఏడాదికి దాదాపుగా రూ.రెండు కోట్ల చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్దమయ్యారు. వేలంలో పాడుకున్నారు. వాళ్లు వైసీపీ నేతలా.. తెలుగుదేశం లీడర్లా అన్నది పక్కన పెడితే ముందుగా వ్యాపారులు. వ్యాపారం అంటే లాభం కోసం చూసుకుంటారు. ప్రభుత్వానికి అప్లికేషన్ ఫీజు.. లైసెన్స్ ఫీజులే ఏడాదికి రూ. రెండు కోట్ల మేర కడితే .. ప్రభుత్వం దగ్గర నుంచి లిక్కర్‌ను భారీ రేటుకు కొని స్వల్ప మార్జిన్‌తో అమ్మితే అంత పెద్ద మొత్తం ఎలా కవర్ చేసుకుంటారు ? అది కూడా కడప మొత్తం ఒకటే బారా అంటే కాదు.. నాలుగైదు బార్లు ఉంటాయి. మరి అందరికీ అంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా వస్తుంది ?
ఇంకా విశేషం ఏమిటంటే భారీగా జనం ఉండి.. మెట్రో స్టైల్ లైఫ్ స్టైల్ ఉన్న విశాఖలో బార్లకు అంత డిమాండ్ రాలేదు. ఒక్కో బార్‌కు రూ. అరవై లక్షల కన్నా ఎక్కువ కట్టడం కష్టమని అక్కడి లిక్కర్ వ్యాపారులు సైడైపోయారు. నిజానికి విశాఖలోనే కోటిన్నర వరకూ వస్తుందని అనుకున్నారు. కానీ అక్కడ మాత్రం ఏ పోటీ లేదు . కడపతో పాటు రాయలసీమ జిల్లాల్లో మాత్రం బార్ల కోసం కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ ట్రెండ్ సహజంగానే అందర్నీ ఆకర్షిస్తోంది.
కడప రాయలసీమ జిల్లాల్లో సెటిల్మెంట్ జరగలేదని వైసీపీ నేతలు ఆధిపత్యపోరాటానికి దిగడంతో ఆ రేటు వచ్చిందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో మాత్రం లిక్కర్ బిజినెస్‌లో పంండిపోయిన ఓ సీనియర్ నేత కనుసన్నల్లో వ్యవహారం అంతా నడిచిందని.. పంచేసుకున్నారని అంటున్నారు. అందుకే ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటున్నారు. సీమలో వచ్చినంత ఆదాయం ఉత్తరాంధ్రలో రాలేదు. విశాఖ లాంటి సిటీ ఉన్నప్పటికీ. ఈ ప్రభుత్వంలో ఏ వ్యవహారం జరిగినా…. ఏ ఒక్కటి కరెక్ట్‌గా జరుగుతున్న దాఖలాలు లేవు. అన్నీ విచిత్రాలే. అందులో ఇదీ ఒకటి అనుకోవడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి.