ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా జగన్ ను మోదీ పుత్సవాత్సల్యంతో చూస్తున్నారని ప్రకటించారు. కుమారుడు అప్పులు చేసి ఇల్లు గుల్ల చేస్తూంటే.. ఎవరైనా తండ్రి మందలిస్తారు. కానీ ఇక్కడ ప్రకటిత దత్తపుత్రుడికి మాత్రం ఎన్ని కావాలంటే అన్ని అప్పులు.. కావాలంటే అదనపు ప్రయోజనాలు కల్పిస్తాం.. ఇష్టం వచ్చినట్లుగా దుర్వినియోగం చేసుకోమని చెబుతున్నారు. దానికి కేంద్రం విడుదల చేసిన తాజా ప్రయోజనాలే సాక్ష్యం.
రాష్ట్రాన్నిఅప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వస్తున్న డబ్బులన్నీ దురాబా చేస్తున్న జగన్ ను గట్టున పడేయడానికి కేంద్రం రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను ఇప్పటికే కల్పించిది. దీని గురించి గొప్పగా చెప్పుకుంటోంది కూడా. అసలు ఇచ్చేది లేదని చెబుతూ వచ్చి రెవెన్యూ లోటు భర్తీ నిధుల కింద రూ. 10,460.87 కోట్లు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సుమారు రూ. 13 వేల కోట్లు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో పాటు రుణ పరిమితిలో విధించిన కోతలో కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించి రూ.5.5 వేల కోట్ల రుణం ఇస్తోంది. ఇలా మొత్తంగా రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను ఎన్నికల ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ. 16,078 కోట్ల మేర రెవెన్యూ లోటు ఉందని కాగ్ సహా నాటి ప్రభుత్వం లెక్కించింది. . ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 46(2) ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు ఉద్దేశించిన రూ. 1,500 కోట్లు సహా మొత్తం రూ. 5,617.89 కోట్లు విడుదల చేసింది. ఇక అంతకు మించి విడుదల చేయాల్సిందేమీ లేదని తేల్చిది. కానీ ఇప్పుడు ఇచ్చింది. జగన్ సర్కార్ అడ్డగోలుగా చేసిన అప్పుల కారణంగా రుణ పరిమితిని తగ్గించింది. 2023-24లో రూ. 8,000 కోట్లు కోత విధించాల్సి ఉంటే.. తాజాగా వాయిదా పద్ధతిలో కోత విధించాలని నిర్ణయించారు. అంటే భారం వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసినట్లన్నమాట.
ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్న రాష్ట్రానికి ఈ మాత్రం సాయం చేయడం అంటే.. ఆ రాష్ట్రాన్ని నిండా ముంచడానికే..