తెలుగులో సీక్వెల్, ప్రీక్వెల్స్ ఆడిన సెంటిమెంట్ పెద్దగా లేదు. అయితే… అనిల్ రావిపూడి మాత్రం `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3`పై గట్టిగానే దృష్టి పెట్టాడు. `ఎఫ్2` వచ్చినప్పుడే `ఎఫ్ 3` తీస్తానని ప్రకటించాడు. అన్నట్టే.. `ఎఫ్ 3`ని సెట్స్‌పై తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. వచ్చే వారంలోనే.. `ఎఫ్ 3` మొదలు కానుంది.
ఎఫ్ 3లో వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ కాబోతోంది. తమన్నా, మెహరీన్‌లే కథానాయికలుగా నటించే అవకాశం ఉంది. అయితే.. వీరిద్దరూ కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లూ.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో వెంకీ పక్కన ఇద్దరు, వరుణ్ పక్కన ఇద్దరు నటిస్తార్ట. దాంతో పాటు ఓ ప్రత్యేక గీతం కూడా ఉండబోతోందట. ఆ పాటలోనూ ఓ హీరోయిన్ మెరవనుంది. అంటే.. ఈ సినిమాలో మొత్తంగా అయిదుగురు హీరోయిన్లు కనిపించే అవకాశం ఉందన్నమాట. తన గత సినిమాలో హీరోయిన్‌కి మరో ఛాన్స్ ఇవ్వడం.. అనిల్ రావిపూడికి అలవాటు. పటాస్ నుంచి ఆ అలవాటు కొనసాగుతోంది. లేటెస్టుగా `ఎఫ్ 2`లో నటించిన తమన్నాకు `సరిలేరు నీకెవ్వరు`లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ కోటాలో సరిలేరు నీకెవ్వరు లో కథానాయికగా నటించిన రష్మిక సైతం `ఎఫ్3`లో కనిపించే ఛాన్స్ వుంది. మొత్తానికి ఎఫ్ 3 నిండా గ్లామరే గ్లామరు.